
మనలో చాలామంది తమ జీవితకాలంలో కారును తప్పనిసరిగా కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ధనవంతులు మాత్రం సాధారణ కార్లకు బదులుగా సకల సౌకర్యాలు ఉన్న కార్లను కొనుక్కుంటారు. అయితే కారు చిన్నదైనా పెద్దదైనా ఆ కారుకు చిన్న గీత కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం కోట్ల రూపాయల ఖరీదు చేసే కారును తగులబెట్టాడు. ఆ వ్యక్తి కారును తగులబెట్టడానికి కారణం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతాం.
రష్యా దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలోని మైఖేల్ లిట్విన్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా తను చేసే సాహసాలకు సంబంధించిన వీడియోలను, ప్రాంక్ వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతనికి కార్లు అంటే చాలా ఇష్టం. మార్కెట్లోకి వచ్చిన కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. కొన్ని రోజుల క్రితం మార్కెట్లోకి వచ్చిన మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63 కారును మైఖేల్ కొనుగోలు చేశాడు.
అయితే కారు కొత్తదే అయినప్పటికీ తరచూ బ్రేక్ డౌన్ సమస్యతో మైఖేల్ ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డీలర్ కు ఎన్నిసార్లు ఇచ్చిన మైఖేల్ సమస్య పరిష్కారం కాలేదు. డీలర్ సమస్య పరిష్కరించకుండానే కారును తిరిగి ఇస్తున్నాడని మైఖేల్ అభిప్రాయపడ్డాదు. దీంతో కంపెనీకు బుద్ధి చెప్పాలని భావించి 2.4 కోట్ల రూపాయల కారుపై పెట్రోల్ పోసి కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను ఫోన్ లో రికార్డ్ చేశాడు.
ఎంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కాల్చివేయడమే సరైన నిర్ణయం అనిపించిందని.. అందుకే కాల్చేశానని మైఖేల్ చెబుతున్నాడు. మైఖేల్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
