లావుగా ఉన్నారా.. ఈ విత్తనాలతో మీ సమస్యకు చెక్..?

ఈ మధ్య కాలంలో ఎక్కువ బరువు సమస్యతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా తగ్గడం సాధ్యం కావడం లేదని చెబుతూ ఉంటారు. అయితే సరైన విధంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే సులువుగా బరువు తగ్గడం సాధ్యమే. శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించడం, జీవక్రియలను పెంచే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గించుకోగలుగుతాం. అయితే ప్రోటీన్లు, ఖనిజాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే కొన్ని విత్తనాలను […]

Written By: Navya, Updated On : October 28, 2020 12:38 am
Follow us on


ఈ మధ్య కాలంలో ఎక్కువ బరువు సమస్యతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా తగ్గడం సాధ్యం కావడం లేదని చెబుతూ ఉంటారు. అయితే సరైన విధంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే సులువుగా బరువు తగ్గడం సాధ్యమే. శరీరంలోని కొవ్వు నిల్వలను కరిగించడం, జీవక్రియలను పెంచే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గించుకోగలుగుతాం.

అయితే ప్రోటీన్లు, ఖనిజాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే కొన్ని విత్తనాలను తీసుకోవడం ద్వారా కూడా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొన్ని రకాల విత్తనాలు బరువు తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూర్చడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో సహాయపడే వాటిలో గుమ్మడికాయ విత్తనాలు ముఖ్యమైనవి. గుమ్మడికాయ గింజలు శరీర జీవక్రియను పెంచి బరువును సులభంగా తగ్గిస్తాయి.

ఫైబర్ ఎక్కువగా ఉండే అవిసె గింజలు సైతం కడుపులోని చక్కెరను నియంత్రించి తక్కువ సమయంలోనే బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఊబకాయం సమస్యతో బాధ పడే వాళ్లు ఆ సమస్య నుంచి బయటపడటానికి చియా విత్తనాలను తీసుకుంటే మంచిది. కడుపు చుట్టూ పేరుకున్న కొవ్వును నియంత్రించడంలో చియా విత్తనాలు సహాయపడతాయి.

ఎంతో రుచిగా ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. చెడు కొవ్వును తగ్గించి శారీరక బలం పెరిగేందుకు ఇవి సహాయపడతాయి. చూడటానికి సన్నగా కనిపించే నువ్వులు సైతం జీవ క్రియను ప్రోత్సహించి బరువు తగ్గేలా చేస్తాయి.