spot_img
Homeట్రెండింగ్ న్యూస్Rs.500 Cancelled : రూ.500 నోట్లు త్వరలో రద్దు.. క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ!

Rs.500 Cancelled : రూ.500 నోట్లు త్వరలో రద్దు.. క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ!

Rs.500 Cancelled : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో సంచలన ప్రకటన చేయబోతోందా.. ఇప్పటికే రూ.2000 నోట్లు ఉపసంహరించుకున్న ఆర్బీఐ త్వరలో రూ.500 నోట్లు కూడా ఉపసంహరించుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. రూ.2000 నోట్లు మార్చుకునేందుకు సెప్టెంబర్‌ 30 వరకు ఆర్బీఐ గడువుగా ప్రకటించింది. తాజాగా పెద్దనోట్ల ఉపసంహరణ అంశంపై కూడా క్లారిటీ ఇచ్చింది.

ఉపసంహరణ ఆలోచన లేదు.. 
రూ.2000 నోట్ల రద్దు ఉపసంహరణ తరువాత రూ.500 నోట్ల రద్దుపైన చర్చ మొదలైంది. రూ.500 నోట్లను కూడా ఉప సంహరించకుతున్నారంటూ సోషల్‌ మీడియా వార్తలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 నోట్లపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్లను సర్క్యూలేషన్‌ నుంచి ఉపసంహరించుకునే ఉద్దేశ్యం లేదని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. రూ.500 నోట్లను వెనక్కి తీసుకుని రూ.1000 నోట్లను పున:ప్రవేశపెట్టాలనే ఆలోచనేమీ లేదన్నారు. రూ.2000 ఉపసంహరణ నేపథ్యంలో కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. ఎవరూ ఇటువంటివి పరిగణలోకి తీసుకోవద్దని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆ నోట్లు 50 శాతం రిటర్న్‌..
మే 19న ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబర్‌ 30 డెడ్‌లైన్‌గా ఖరారు చేసింది. ఈ నోట్ల డిపాజిట్‌పైన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కీలక అంశాలను వెల్లడించారు. గడిచిన 20 రోజుల్లో రూ.2000 నోట్ల డిపాజిట్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కేవలం మూడు వారాల్లోనే 50 శాతం నోట్లు డిపాజిట్‌ అయినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో 85 శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చినట్లు తెలిపారు. మార్చి 31 వరకు చలామణిలో ఉన్న రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయినట్లు శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. చివరి వరకు నోట్ల మార్పు కోసం వేచి చూడవద్దని ఆర్బఐ గవర్నర్‌ సూచించారు. రద్దీని తగ్గించేందుకు ప్రజలు ముందుగానే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా సెంట్రల్‌ బ్యాంకు కరెన్సీ కలిగి ఉందని స్పష్టం చేశారు.
కొత్తగా రూ.1000 నోటు ఆలోచన లేదు..
రూ.2000 నోట్ల ఉపసంహరణతర్వాత రూ.1000 నోట్లు ప్రవేశపెడతామని ప్రచారం జరుగుతోందని శక్తికాంత్‌దాస్‌ తెలిపారు. ఇది కూడా పూర్తిగా అవాస్తవమన్నారు. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన ఆర్బీకి లేదని స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో సామాన్యుల్లో నెలకొన్న అపోహాలు.. సందేహాలకు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper