Chickpeas Benefits: శనగలు మనకు మంచి ప్రొటీన్లు అందించే ఆహారం. ఇందులో ఉండే పోషకాల వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్పాహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మొలకెత్తిన శనగ విత్తనాల్లో ఎంతో బలం ఉంటుంది. వాటిని తినడం వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి శనగలను గిన్నెలో పోసి నీళ్లు పోసుకుని ఆరు గంటల పాటు నానబెడితే మొలకలు రావడం జరుగుతుంది.
మధుమేహాన్ని నిరోధిస్తుంది
మధుమేహానికి శనగలు ఎంతో ఉపయోగపడతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. పొటాషియం, ఐరన్, జింక్ వంటివి అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటుకు కూడా చెక్ పెడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇలా శనగలు మన ఆరోగ్యంపై మంచి ప్రభావాలు చూపుతాయి.
అజీర్తి
శనగలు మలబద్ధకాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అజీర్తి సమస్యతో బాధపడేవారు వీటిని తింటే ఫలితం ఉంటుంది. మహిళల్లో ఉండే రక్తహీనతను కూడా దూరం చేస్తాయి. ఇందులో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తినడం మంచిది. దీంతో ఆడవారికి రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా శనగలు మనకు మేలు చేస్తాయి.
అధిక బరువును తగ్గిస్తాయి
శనగలు తినడం వల్ల గుండెకు రక్తసరఫరా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. గుండెలోని రక్తకణాలు మూసుకుపోయే ప్రమాదం తగ్గుతుంది. ఫోలేట్ వల్ల కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అధిక బరువుతో బాధపడేవారు శనగలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తిని ఇస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.