The Gray Man: ఈ ఏడాది #RRR చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే..బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ వెండితెర అద్భుతం ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులందరినీ అలరించింది..రామ్ చరణ్ – ఎన్టీఆర్ నటన మరియు దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభ ని మెచ్చుకోని వాళ్లంటూ ఎవ్వరూ లేరు..అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ లో అంతకు మించి సెన్సేషన్ సృష్టించింది..నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ ని విడుదల చెయ్యగా విదేశీయులు కూడా ఎగబడి చూసారు.

ఫలితంగా ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది..దర్శక ధీరుడు రాజమౌళి కి పలు అవార్డ్స్ కూడా వచ్చాయి..రీసెంట్ గా ఈ చిత్రం లోని ‘నాటు నాటు’ పాట ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడానికి షార్ట్ లిస్ట్ అయ్యింది..అలా ఎన్నో ఎత్తులు చూసిన ఈ సినిమా ఒక అరుదైన రికార్డు ని మిస్ అయ్యింది.
అసలు విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాల హవానే ఉంటుంది..టాప్ 10 మోస్ట్ వ్యూస్ వచ్చిన సినిమాలు వాళ్ళవే ఉంటాయి..కానీ ఈసారి #RRR సినిమా టాప్ 10 వ్యూస్ రప్పించుకున్న సినిమాగా నిలుస్తాడని అందరూ అనుకున్నారు..ఎందుకంటే ఆ చిత్రం సుమారు 20 వారాల పాటుగా నాన్ స్టాప్ ట్రెండ్ అయ్యింది..అన్ని రోజులు ట్రెండ్ అయినా సినిమా హాలీవుడ్ నుండి కాకుండా ఇండియా నుండి మన #RRR మాత్రమే అని నెట్ ఫ్లిక్స్ సంస్థ సైతం చెప్పుకొచ్చింది.

అయితే ఈ ఏడాది టాప్ హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సినిమాల లిస్ట్ ని నెట్ ఫ్లిక్స్ విడుదల చెయ్యగా #RRR కి చోటు దక్కకపోవడం విశేషం..ధనుష్ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించిన ‘ది గ్రే మ్యాన్’ చిత్రం టాప్ 1 స్థానం లో నిలిచింది..కానీ #RRR కి మాత్రం టాప్ 20 లో కూడా చోటు దక్కలేదు..అన్ని హాలీవుడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు మాత్రమే ఈ లిస్ట్ లో ఉన్నాయి.