Oscor RRR : ఆస్కార్ అవార్డ్స్ రేస్ లో #RRR..ఉత్తమ నటుడిగా రామ్ చరణ్..ఉత్తమ సహాయనటుడిగా ఎన్టీఆర్

Oscor RRR : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన #RRR చిత్రం మేనియా అప్పుడే ముగిసిపోయింది అనుకుంటే పొరపాటే..ఇప్పటికీ ఈ చిత్రం జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది..24 సంవత్సరాలుగా జపాన్ లో చెక్కుచెదరకుండా అలాగే ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు మూవీ కలెక్షన్స్ రికార్డుని #RRR బద్దలు కొట్టేసింది. ముత్తు సినిమా 400 జపనీస్ మిలియన్ డాలర్లు […]

Written By: NARESH, Updated On : December 11, 2022 12:58 pm
Follow us on

Oscor RRR : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన #RRR చిత్రం మేనియా అప్పుడే ముగిసిపోయింది అనుకుంటే పొరపాటే..ఇప్పటికీ ఈ చిత్రం జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది..24 సంవత్సరాలుగా జపాన్ లో చెక్కుచెదరకుండా అలాగే ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు మూవీ కలెక్షన్స్ రికార్డుని #RRR బద్దలు కొట్టేసింది.

ముత్తు సినిమా 400 జపనీస్ మిలియన్ డాలర్లు వసూలు చెయ్యగా..#RRR రీసెంట్ గానే ఆ రికార్డు ని బద్దలు కొట్టి ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోతుంది..అంతే కాకుండా అమెరికా లో ఇప్పటికీ ఈ చిత్రం పలు ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతూనే ఉంది..కేవలం బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు..అవార్డ్స్ పరంగా కూడా ఏ ఇండియన్ సినిమాకి కూడా దక్కని అరుదైన గౌరవాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.

రీసెంట్ గానే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజమౌళి కి ‘న్యూయార్క్ క్రిటిక్స్ ఫిల్మ్ సర్కిల్’ నుండి ఉత్తమ దర్శకుడు అవార్డు లభించింది..ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు..హాలీవుడ్ సినిమాల మధ్య మన తెలుగు సినిమాకి సంబంధించిన డైరెక్టర్ నిలబడడం అనేది ఒక గొప్ప విజయం..ఇక రీసెంట్ గానే ఆ సినిమాలో ఒక హీరో గా నటించిన రామ్ చరణ్ కి  NDTV సంస్థ నిర్వహించిన ట్రూ లెజెండ్  అవార్డ్స్ ఈవెంట్ లో  ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డు లభించింది.

ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ కి LAFCA (లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్) సంస్థ 2022 వ సంవత్సరం కి గాను నిర్వహిస్తున్న అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్ ని ఉత్తమ నటుడిగా నామినేట్ చేసారు..ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అని చెప్పొచ్చు..ఈ అవార్డు ఆస్కార్ అవార్డు నామినేషన్స్ కి ఒక్క అడుగు దూరం అని చెప్పొచ్చు..ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ నామినేట్ అవ్వగా..ఉత్తమ సహాయనటుడిగా జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అయ్యాడు..ఆస్కార్ అవార్డ్స్ కి కూడా వీళ్లిద్దరు ఈ క్యాటగిరీ లలోనే నామినేట్ అయ్యే అవకాశం ఉందని హాలీవుడ్ విశ్లేషకులు చెప్తున్న మాట