ఎన్నికల తర్వాత అవకతవకలు జరిగాయని.. న్యాయపోరాటం చేస్తున్న ట్రంప్ ఎట్టకేలకు అన్ని రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డ వేళ తన ఓటమిని అంగీకరించాడు. బిడెన్ విజయం సాధించారని పరోక్షంగా ప్రస్తావించారు. కానీ ఎక్కడా బిడెన్ పేరును మాత్రం ప్రస్తావించకపోవడం విశేషం.
Also Read: వైరల్ వీడియో: పాకిస్తాన్ పై భారత్ మెరుపుదాడి
కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ విధించాలని అనుకోమని.. తమ ప్రభుత్వం ముందుకెళ్లదని ట్రంప్ చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఈ ప్రశ్నలకు భవిష్యత్తులో సమాధానం వస్తుందన్నారు. దీన్ని బట్టి జోబైడెన్ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ఇన్ డైరెక్టుగా చెప్పినట్టైంది. తమ ప్రభుత్వం కరోనా పై ఎలాంటి చర్యలు తీసుకోదని.. వచ్చే ప్రభుత్వానిదే బాధ్యత అని ట్రంప్ చూచాయగా చెప్పినట్టైంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో అమెరికాలో కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి లాక్ డౌన్ విధించబోనని ట్రంప్ ప్రకటించారు. దీనిపై తన తర్వాత వచ్చే అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ ఏప్రిల్ లో వ్యాక్సిన్ అందజేస్తామని ట్రంప్ ప్రకటించారు.
Also Read: ఈ కార్డు ఉన్నవాళ్లకు శుభవార్త.. 50 శాతానికి పైగా డిస్కౌంట్..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోకుండా పేచీ పెడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ న్యాయం పోరాటం చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.ఇప్పటివరకు బైడెన్ గెలిచాడనే అంశాన్ని స్పష్టం చేయని ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి ఓటమిని అంగీకరించినట్టైంది.