https://oktelugu.com/

దర్శక నిర్మాతలు అందరూ సినిమాని ఏప్రిల్ 28 నే విడుదల చేయాలని ఎదురు చూస్తారు ? ఏమిటా చరిత్ర చుడండి ..!

RRR Release: బాహుబలితో ప్యాన్ ఇండియా లెవల్ కు ఎదిగిన జక్కన్న ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. సినిమాను తీయడంలోనే కాదు.. దాన్ని మార్కెట్ చేయడంలో.. వసూళ్లు రాబట్టుకోవడంలో రాజమౌళిని మించిన జీనియస్ లేడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్లాన్ చేసి అన్ని సినిమాలను వాయిదా వేయించిన రాజమౌళి కరోనా కల్లోలానికి వెనక్కి తగ్గారు. తన సినిమాను వాయిదా వేశారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను సమ్మర్ కు ప్లాన్ చేశారు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2022 / 04:09 PM IST
    Follow us on

    RRR Release: బాహుబలితో ప్యాన్ ఇండియా లెవల్ కు ఎదిగిన జక్కన్న ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. సినిమాను తీయడంలోనే కాదు.. దాన్ని మార్కెట్ చేయడంలో.. వసూళ్లు రాబట్టుకోవడంలో రాజమౌళిని మించిన జీనియస్ లేడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్లాన్ చేసి అన్ని సినిమాలను వాయిదా వేయించిన రాజమౌళి కరోనా కల్లోలానికి వెనక్కి తగ్గారు. తన సినిమాను వాయిదా వేశారు.

    RRR Release

    ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను సమ్మర్ కు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే రెండు తేదీలను లాక్ చేశాడు. అందులో ఒకటి ఏప్రిల్ 28. అయితే ఇప్పటికే ఎఫ్3ను ఈ డేట్ కే రిలీజ్ చేయాలని ప్రకటించారు. కానీ రెండింటికి దిల్ రాజుయే పంపిణీదారు కావడంతో ఎఫ్3 వాయిదా పెద్ద ఇష్యూ కాదు. ప్రస్తుతానికి కరోనా తగ్గి థియేటర్లు తెరిస్తేనే ‘ఆర్ఆర్ఆర్’ ఆ తేదీల్లో విడుదలవుతుంది. లేదంటే మరింత ఆలస్యం ఖాయం. ఖచ్చితమైన తేదీని ఇప్పుడే నిర్ణయించలేం.

    Also Read:  మహేష్ నిర్మాణంలో వస్తున్న ‘మేజర్’ వాయిదా !

    అయితే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ ఏప్రిల్ 28కి మంచి చరిత్ర ఉంది. ఆ డేట్ కు బ్లాక్ బస్టర్ హిస్టరీ ఉంది. అందుకే రాజమౌళి ఏరికోరి ఆ డేట్ ను ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు లాక్ చేశారన్నది ఇండస్ట్రీ వర్గాల మాట..

    తెలుగు మాస్ సినిమాలకు ‘ఏప్రిల్ 28’ బూస్టర్ లా పనిచేసింది. తెలుగులో మాస్ మసలా సినిమాలకు పురుడు పోసిన ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ 1977 ఏప్రిల్ 28నే రిలీజ్ అయ్యింది. ఏడాది పాటు ఆడి కోట్ల రూపాయల కనకవర్షం కురిపించింది.

    adavi ramudu

    ఇక మహేష్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘పోకిరి’ మూవీ 2006 ఏప్రిల్ 28నే రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ చరిత్రలోనే అప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించింది.

    కమెడియన్ అలీని హీరోగా పెట్టి ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ‘యమ లీల’ కూడా ఏప్రిల్ 28నే రిలీజ్ అయ్యింది. కమెడియన్ తో సినిమా ఫ్లాప్ అవుతందని ఎస్వీ కృష్ణారెడ్డిని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

    ఇక ఇవన్నీ చరిత్ర అనుకుంటే రాజమౌళి ‘బాహుబలి2’ను రిలీజ్ చేసింది 2017 ఏప్రిల్ 28నే కావడం గమనార్హం. టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈ మూవీ ఇదే రోజున రిలీజ్ అయ్యి కోట్ల వర్షం కురిపించింది.

    pokiri

    కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించిన ‘అడవి సింహాలు, కమల్ హాసన్ ‘శుభ సంకల్పం’ లు ఇదే తేదీన రిలీజ్ కావడం గమనార్హం.

    ఏడాదికోసారి ఏప్రిల్ 28 వస్తుంది. ఆరోజు శుక్రవారం కాకపోయినా చరిత్ర చూసి ఆరోజున రిలీజ్ చేస్తుంటారు టాలీవుడ్ పెద్దలు. మరి బాహుబలితో హిట్ కొట్టిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో అవే రికార్డులు బద్దలు కొడుతాడా? లేదా? అన్నది వేచిచూడాలి.

    Also Read:  జగన్, మంత్రులకు షాక్.. ఏపీలో మోగిన సమ్మె సైరన్