Gulf Countries: అరబ్ దేశాలు ఉలిక్కిపడ్డాయి. బాంబుదాడులతో దద్దరిల్లాయి. శాంతి జపం వల్లించే దేశాలు ఒక్కసారిగా ఆందోళన చెందాయి. ఇన్నాళ్లు ఏ గొడవ లేకుండా ఉన్న ప్రాంతాలు కలవరం చెందాయి. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి అంతా హతాశులయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యెమెన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్ మద్దతు ఇస్తున్నట్లుగా అనుమానిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు ఎమిరేట్స్ పై బాంబు దాడి జరిగింది.
ఈనెల 17న హౌతీ తిరుగుబాటు దారులు అబుధాబిపై డ్రోన్ల దాడికి తెగబడిన నేపథ్యంలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తాన్ పౌరుడు చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అబుధాబిలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. బాంబుల దాడితో పారిశ్రామిక ప్రాంతంలోని ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. యెమెన్ లోని షాబ్వా, మరీబ్ రీజియన్లపై వైమానిక దాడులకు ప్రతీకారంగా బాంబు దాడులకు దిగినట్టు తెలుస్తోంది.
Also Read: త్వరలోనే మీరు కోలుకోవాలి సర్ – మెగాస్టార్ చిరంజీవి
దీంతో గల్ఫ్ దేశాల్లో రగిలిన రగడ అప్పుడే చల్లారేలా లేదు. అరబ్ దేశాల్లో పెరిగిన నిరసన జ్వాల ఆగడం లేదు.బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో తూర్పు ఆసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. అంతర్జాతీయంగా వేదికలు కలవరపడుతున్నాయి. అరబ్ దేశాల పరిస్థితికి అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
ఈ పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో నెలకొన్న అలజడి దృష్ట్యా వ్యాపారం కూడా కుదేలైపోతోంది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించుకునే స్థాయికి వెళ్లింది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. అసలే పెట్రో దేశాలు కావడంతో బాంబుల మోత కురిపిస్తే పేలుడు నష్టం తీవ్రంగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే శాంతి కోసం దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభంతో పెట్రో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చమురు కంపెనీలు ఇదే అదనుగా ధరలు అమాంతం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పెట్రో ధరలు పెరిగే ప్రభావాలు కనిపిస్తున్నాయి.
Also Read: జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారం ఇదే!