Hero Satyadev: యువ హీరోలలో మంచి ప్రతిభ ఉన్న హీరో సత్యదేవ్..విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ని వేసుకున్నారు ఈయన..ఎవరీ కొత్త కుర్రాడు..చాలా బాగా చేస్తున్నాడే అని చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సత్యదేవ్ నటన చూస్తే..ఒక పక్క హీరో గా నటిస్తూనే మరోపక్క క్యారక్టర్ ఆర్టిస్టు గా తనలోని కొత్త కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు సత్య దేవ్..రీసెంట్ గా ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో విలన్ గా నటించి మెగాస్టార్ తో సరిసమానమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.

ఇక ఆ తర్వాత హిందీ లో అక్షయ్ కుమార్ తో కలిసి ‘రామ్ సేతు’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించి బాలీవుడ్ ఆడియన్స్ నుండి కూడా మంచి మార్కులు కొట్టేసాడు..అలా నటుడిగా సినిమా సినిమాకి తనని కొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న సత్యదేవ్ హీరో గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా చేసాడు..ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు సత్య దేవ్..అందులో భాగంగా నిన్న ఆయన నెటిజెన్స్ తో కాసేపు సరదాగా ముచ్చటించారు..వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలి లో సమాధానం ఇచ్చాడు..ఒక నెటిజెన్ సత్యదేవ్ ని అడుగుతూ ‘నాకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు..వాళ్ళ ముగ్గురుకి టికెట్స్ బుక్ చెయ్’ అని అంటాడు..అప్పుడు సత్యదేవ్ సమాధానం ఇస్తూ ‘వాళ్ళు ముగ్గురుకి బుక్ చేస్తే..మరి నీ సంగతేంటి..నువ్వు రావా’ అని అడుగుతాడు సత్యదేవ్.

మరో నెటిజెన్ ‘సినిమా మీద అసలు ఆసక్తి రావడం లేదు..మూవీ చూసి బాగుంటే చెప్పు..టికెట్ బుక్ చేసుకుంటా’ అని అంటాడు..అప్పుడు సత్యదేవ్ ‘చూసాను..చాలా బాగుంది..ఇక టికెట్ బుక్ చేసుకో’ అని సమాధానం ఇస్తాడు..మరో నెటిజెన్ మాట్లాడుతూ ‘ఈమధ్య రీమేక్ సినిమాలు థియేటర్స్ లో ఆడడం లేదు..ఓటీటీ కి ఇచ్చుకోవచ్చు కదా’ అని అంటాడు..అప్పుడు సత్యదేవ్ ‘ఓటీటీ కి మంచి రేట్ కి అడిగారు..కానీ ఈ సినిమా థియేటర్స్ లో చూస్తేనే గొప్ప అనుభూతి కలుగుతుంది..అందుకే ఇవ్వలేదు’ అని అంటాడు..ఈ సినిమా కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచినా ‘లవ్ మాక్టైల్ ‘ అనే చిత్రానికి రీమేక్..యూత్ ఈ సినిమాకి అక్కడ బ్రహ్మరధం పట్టారు..మరి ఇక్కడ ఎలా ఉండబోతుందో చూడాలి..తెలుగు లో తమన్నా హీరోయిన్ గా నటించింది.