Homeఆంధ్రప్రదేశ్‌KCR- Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కుయ్‌.. కుయ్‌.. తెలంగాణలో టింగ్‌.. టింగ్‌! ఆ ముఖ్యమంత్రుల తీరేవేరు!!

KCR- Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కుయ్‌.. కుయ్‌.. తెలంగాణలో టింగ్‌.. టింగ్‌! ఆ ముఖ్యమంత్రుల తీరేవేరు!!

KCR- Jagan: ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఎక్కువగా భాషా ప్రయోగాలు ఉంటాయి. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో వైఎస్‌.రాజశేఖరరెడ్డి రెండోసారి గెలవడానికి చేసిన కొన్ని ప్రచార ట్రిక్కుల్లో తాను 108 అంబులెన్స్‌లు తెచ్చానని చెప్పుకునేందుకు .. ఫోన్‌ చేస్తే.. కుయ్‌.. కుయ్‌ అని అంబులెన్స్‌ వస్తుందని.. విచిత్రంగా సౌండ్స్‌ చేస్తూ ప్రచారం చేశారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజశేఖరరెడ్డి తనయుడు, ప్రస్తుతం ఏఈ ముఖ్యమంత్రి కూడా తండ్రిలాగే భాషాప్రయోగం చేశారు. ఇల. ఇల.. ఇల.. ఇల.. అంటూ చేయి ఊపుతూ ఎన్నికల ప్రచార సభల్లో జనాల్లో ఊపు తెచ్చారు. కుయ్‌.. కుయ్‌ అంటూ తన తండ్రి తెచ్చిన 108 అంబులెన్స్‌లనూ గుర్తుచేశారు. ఈ ఇద్దరూ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రులు అయ్యారు.

KCR- Jagan
KCR- Jagan

వారిని అనుసరిస్తున్న కేసీఆర్‌..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా ఇప్పుడు వారిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భాషా ప్రయోగంలో ఆయన స్టైల్‌ వేరు. జగిత్యాల పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రైతుబంధు నిధులు పది రోజుల్లో వస్తాయని చెప్పడానికి ఆయన చేసిన పద ప్రయోగం హైలెట్‌ అవుతోంది. రైతుబంధు నిధులు.. మరో వారం, పది రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అయితే సాదాసీదాగా చెప్పలేదు. తనదైన శైలిలో చెప్పారు. ‘ రైతుబంధు వస్తది? ఇంకో ఐదు పది రోజుల్లో రైతుబంధు పడుతుంది? పడాలి కదా? ఎట్ల పడుతది.. బ్యాంకుల్లో పడంగనే టింగు.. టింగుమని ఫోన్‌కు మెస్సేజ్‌ వస్తది’ అని హావభావాలతో చెప్పారు.

KCR- Jagan
KCR- Jagan

వ్యతిరేకతను అధిగమించేందుకే..
తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, ఆసరా పింఛన్ల పంపిణీ రెండేళ్లుగా ఆలస్యంగా అందుతున్నాయి. ఏడాదిగా రైతుబంధు నిధుల విడుదలతోనూ జాప్యం జరుగుతోంది. దీంతో అటు ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇటు రైతుల్లోనూ వ్యతిరేకత పెరుగుతోంది. పథకం ప్రారంభంలో నవంబర్‌ చివరి వారం.. డిసెంబర్‌ మొదటి వారంలో రైతుబంధు చెల్లించేవారు. ప్రస్తుతం డిసెంబర్‌ తొలివారం గడిచినా రైతుబంధు చెల్లింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. పింఛన్లే చెల్లిచడానికి అపసోపాలు పడుతున్న కేసీఆర్‌ సర్కార్‌ యాసంగిలో రైతుబంధు చెల్లిస్తుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు కేసీఆర్‌ ఇలా వినూత్నంగా రైతుబంధు పది రోజుల్లో ఇవ్వబోతున్నామని ప్రకటన చేశారు.మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో నాడు కుయ్‌.. కుయ్‌.. అని ముఖ్యమంత్రులు భాషసాప్రయోగం చేయగా, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి టింగ్‌.. టింగ్‌ అంటూ విభిన్న శైలిలో అనుసరించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version