
Tamil Nadu Robbery: దేశంలో ఉత్తరభారత దేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్‌లో అరాచకాలు ఎక్కువ. దక్షిణ భారతదేశానికి వచ్చే సరికి తమిళనాడు అరాచకాల్లో ముందుంటుంది. దేశం మొత్తం చూసుకుంటే.. బీహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఘోరమైన నేరాలు జరిగేది తమిళనాడులోనే. ఇక్కడి నేరాల్లో కొన్ని ఒళ్లు గగ్గుర్లుపొడిచేలా ఉంటాయి. ఇలాంటి ఘటన తాజాగా తహిళనాడులో జరిదింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ దుండగుడు మహిళ తలపై కొట్టి ఆమె స్పృహ తప్పగానే రోడ్డుపైకి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు.
ఆలస్యంగా వెలుగులోకి..
పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ తలపై కొట్టి దొంగతనానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె స్పృహ కోల్పోగానే రోడ్డుపై నుంచి ఫుట్‌పాత్‌పైకి లాక్కెల్లి చోరీకి ఒడిగట్టాడు ఆ దుండగుడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో బాధితురాలు సీతాలక్ష్మి(53) ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. ఆదివారం సెలవు కావడంతో ఆమె ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. దొంగతనానికి అదే అదునుగా భావించిన నిందితుడు సెంథిల్‌కుమార్ ఆమె తలపై చెక్క పలకతో కొట్టేశాడు. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమె కాళ్లు పట్టుకుని పుట్‌పాత్‌పైకి లాక్కెళ్లాడు. ఆమె ద్విచక్రవాహన తాళాలు స్వాధీనం చేసుకున్నాడు. ఆమె ఫో¯Œ ను సైతం దొంగిలించి అక్కడ నుంచి పారిపోయాడు.

స్పృహలోకి వచ్చాక ఫిర్యాదు..
కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు సీతాలక్ష్మికి జరిగిన విషయం అర్థమైంది. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడి కోసం గాలిస్తుండగా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నిందితుడు పోలీసులను గమనించి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడి కాలికి గాయమైంది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
సీతాలక్ష్మికి బలమైన గాయమే అయినప్పటికీ తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా దుండగులకు కఠిన శిక్షలు పడుతున్నా.. అరాచకాలు మాత్రం ఆగడం లేదు.