అందుకే వారి కాళ్లు కడిగాను’ అని అన్నారు. అంతకు ముందు మోదీ సంగం ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించిన మోదీ.. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గంగమ్మ తల్లికి పూజలు చేశారు.
PM Modi : కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న కార్మికులను మోదీ సత్కారించారు. వారికి శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంటు భవనం నిర్మించారు. అలాగే పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వ మత ధర్మ ప్రార్ధనలు నిర్వహించారు. సర్వ మత ధర్మ ప్రార్ధనల్లో ప్రధాని మోడీ, కేంద్ర మం త్రులు, ప్రముఖులు, వేద పండితులు పాల్గొన్నారు.
భారతీయత ఉట్టిపడేలా..
ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా.. పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోడీకి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మోడీ నివాళులర్పించారు. అనంతరం అక్కడ జరిగిన యాగంలో పాల్గొన్నారు. స్పీకర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
గతంలో పారిశుధ్య కార్మికులకు పాదపూజ…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2019, ఫిబ్రవరిలో కుంభమేళాలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి పూజలు చేసిన మోదీ.. ఆ తర్వాత అర్ధ కుంభమేళాలో రాత్రింబవళ్లు కష్టపడి త్రివేణి సంగమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల కాళ్లు, కడిగి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘కుంభమేళా విజయవంతమవడానికి పారిశుధ్య కార్మికులు చేసిన కృషిని వెల కట్టలేం. అందుకే వారి కాళ్లు కడిగాను’ అని అన్నారు. అంతకు ముందు మోదీ సంగం ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించిన మోదీ.. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గంగమ్మ తల్లికి పూజలు చేశారు.