Homeబిజినెస్MG Motors Premium Electric Cars: హ్యుందాయ్ Creta, కియా సేల్టోస్ కార్లకు చుక్కలు చూపించేందుకు...

MG Motors Premium Electric Cars: హ్యుందాయ్ Creta, కియా సేల్టోస్ కార్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్న MG మోటార్స్..

MG Motors Premium Electric Cars: ఆటోమోబైల్ మార్కెట్లో కార్ల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను ప్రవేశ పెడుతూ ఉంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు హవా పెరిగిపోతుంది. నేనే పద్యంలో ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన Hyundai Creta, Tata Sierra ఈవీ కార్లు దూసుకుపోతున్నాయి. అయితే ఇదే తరహాలో ఉండే కారులను తయారుచేసి వీటికి పోటీ ఇచ్చేందుకు MG Motors కొత్త కార్లను తీసుకువస్తుంది. ఇప్పటికే MG కంపెనీ నుంచి Vinder Ev వంటివి మార్కెట్లోకి తీసుకువచ్చి సక్సెస్ సాధించిన ఈ కంపెనీకి ZS Ev వంటి కార్లు ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. దీంతో ఇప్పుడు JSW కంపెనీతో కలిసి కొత్త SUV EV నీ తీసుకురాబోతోంది. ఇవే కాకుండా మరికొన్ని కార్లు కూడా ఈ కంపెనీ ప్రవేశపెట్టబోతుంది. వాటి వివరాలు కి వెళ్తే..

వచ్చే రెండు ఏళ్లలో MG మోటార్స్ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది.. వీటిలో MG IM6, MG NEV వంటి కార్లు ఉండబోతున్నాయి. MG IM6 కారు విషయానికి వస్తే.. దీనిని ఇప్పటికే 2025 సంవత్సరంలో మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ కారులో 26.3 అంగుళాల బిగ్ డిస్ప్లే ఉండనుంది. LED లైటింగ్స్ తో 10.5 అంగుళాల పోర్ట్రైట్ డిస్ప్లే కనిపిస్తుంది. ఈ కారులో 800 వ బ్యాటరీ ప్యాక్ ఉండగా.. ఇది 778 బిహెచ్పి పవర్ తో పాటు 802 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది.100 kWh వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని అందించే దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 555 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 3.4 సెకండ్లకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందించే ఈ కారు ధర రూ.60 లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలోగా ఈ కారును మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న M9 కంటే ఈ కారు ధర తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

MG మోటార్స్ నుంచి రాబోతున్న మరో కారు MG NEV.. ఇది 5 నుంచి 7 సీట్ల వరకు ఉండే అవకాశం ఉంది.. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారుగా చెప్పబడుతున్న ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 20.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఈ ఇంజన్ 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. అలాగే స్టార్ లైట్ అనే మరో వేరియంట్ 56.7 కిలోవాట్ల బ్యాటరీ ఉండరు ఉంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. 2026 చివరి నాటికి లాంచ్ అయ్యే ఈ కారు మార్కెట్లోకి వస్తే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న మహీంద్రా XUV7XO కారుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక JSW తో కలిసి MG కంపెనీ MG ONE SUV ఆధారంగా కొత్త కారును తీసుకురాబోతుంది.. ఈ కారు SAIC ప్లాట్ఫారం ఆధారంగా తయారయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే హుందాయి క్రెటా, కియా సేల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version