Rishabh Pant
Rishabh pant : రిషబ్ పంత్ మీద సంజీవ్ గోయెంక.. ఎన్ని ఆశలైతే పెట్టుకున్నాడో.. అవన్నీ కూడా అడియాసలు అవుతున్నాయి. గత ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ ను గోయెంక దాదాపు 27 కోట్లకు మించి పెట్టి కొనుగోలు చేశాడు. అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. జట్టుకు కొత్త రూపం తీసుకొస్తాడని.. ఈసారైనా విజేతగా నిలుపుతాడని భావించాడు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎందుకంటే లక్నో జట్టు తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడింది. ఆ మ్యాచ్లో ఓటమిపాలైంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఆ మ్యాచ్లో చేసిన పరుగులు సున్నా. ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. ఇక గత ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో లక్నో జట్టు తలపడింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 15 బంతులు ఎదుర్కొన్న అతడు 15 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో లక్నో జట్టు గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకుంటే రిషబ్ పంత్ కు వాచిపోయేది.
Also Read : రిషబ్ పంత్ మీద పట్టరాని కోపంతో టీవీ పగలగొట్టాడు.. వీడియో వైరల్
రెండు పరుగులకే..
ఇక లక్నో జట్టు మంగళవారం సొంత మైదానం వేదికగా కింగ్స్ 11 పంజాబ్ జట్టుతో ఆడుతోంది.. మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. లక్నో జట్టులో పూరన్(44), ఆయుష్ బదోని (41) టాప్ స్కోరర్లు గా నిలిచారు. అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతడు మాక్స్ వెల్ బౌలింగ్లో చాహల్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.. ఓపెనర్ మార్ష్ సున్నా పరుగులకు అవుట్ కావడంతో లక్నో జట్టు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన పూరన్ దూకుడుగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత కొద్ది సమయానికి మరో ఓపెనర్ మార్క్రం(28) అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన పంత్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పడేసుకున్నాడు. ఒకవేళ అతడు గనుక ఉండి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. కానీ కీలక దశలో వికెట్ కోల్పోవడంతో లక్నో జట్టు భారీగా పరుగులు చేయలేకపోయింది.. గత ఐపీఎల్ మెగా వేలంలో హైయెస్ట్ ప్రైస్ సొంతం చేసుకున్న పంత్.. దానికి తగ్గట్టుగా ఆడటంలో విఫలమవుతున్నాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే చేసింది 17 పరుగుల అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Also Read : చేసింది 0, 15 పరుగులు.. వేలంలో 27 కోట్లు..