https://oktelugu.com/

Rishabh Pant: రిషబ్ పంత్ మీద పట్టరాని కోపంతో టీవీ పగలగొట్టాడు.. వీడియో వైరల్

Rishabh Pant ఆట మీద ప్రేమ ఉండాలి. అది తప్పు కాదు. ఆటగాళ్ల మీద ఇష్టం ఉండాలి అది కూడా తప్పుకాదు. కానీ ప్రేమ హద్దులు దాటితే.. ఇష్టం ఇష్టానుసారంగా మారితే అసలు సమస్యలు వస్తాయి.

Written By: , Updated On : March 28, 2025 / 05:08 PM IST
Rishabh Pant (1)

Rishabh Pant (1)

Follow us on

Rishabh Pant: ప్రస్తుతం ఐపీఎల్ (IPL) నడుస్తోంది. పది జట్లు పోటాపోటీగా ఆడుతున్నాయి.. కొన్ని జట్లు విజయాలు సాధిస్తే.. మరికొన్ని జట్లు ఓటములను చవిచూస్తున్నాయి. మొత్తానికి సింహభాగం మ్యాచ్ లు చివరి ఓవర్ వరకు సాగుతున్నాయి. చూసే ప్రేక్షకులకు అద్భుతమైన క్రికెట్ మజాను అందిస్తున్నాయి.. ఆటగాళ్లు ఆడే విధానం అద్భుతంగా ఉండడంతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు పట్టరాని ఆనందం కలుగుతున్నది. అందులో కొంతమంది మైదానం లోపలికి ప్రవేశిస్తున్నారు. ఇటీవల బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఓ అభిమాని సెక్యూరిటీని ఛేదించుకొని మైదానం లోపలికి వచ్చాడు. విరాట్ కోహ్లీ కాళ్ళ మీద పడ్డాడు. ఇలాంటి సంఘటనలు మైదానంలో ఉన్న సెక్యూరిటీ లోపాలను బయటపెడతాయి. మ్యాచ్ చూసే ప్రేక్షకుల సంగతి కాస్త పక్కన పెడితే.. క్రికెట్ మీద అవగాహన ఉన్న అనలిస్టులు కూడా తమ ఉద్రేకాన్ని అణుచుకోలేక పోతున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది…

టీవీ ని పగలగొట్టాడు

ఐపీఎల్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో చాలా చానల్స్ చర్చ వేదిక నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అనలిస్టులను పిలిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఓ క్రికెట్ అనలిస్టు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది..గురు వారం హైదరాబాద్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అనంతరం “స్పోర్ట్స్ తక్” అనే ఛానల్ క్రీడా చర్చ నిర్వహించింది.. ఈ క్రమంలో రిషబ్ పంత్ పై కోపంతో బాబాజీ అనే ప్యానలిస్ట్ టీవీని పగలగొట్టాడు.. “లక్నో జట్టుకు ఇటువంటి కెప్టెన్ అవసరం లేదు. అలాంటి మనిషిని కెప్టెన్ గా పెట్టుకొని ఎలా ఆడాలి? అతనిపై నమ్మకం పెంచుకుంటే పని జరగదు. అతడికి అందరికీ లభించని అవకాశాల కంటే ఎక్కువ లభించాయి” అంటూ టీవీ పైకి రిమోట్ విసిరి కొట్టాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. బాబాజీ కోపానికి ప్రధాన కారణం రిషబ్ పంత్ ఢిల్లీ, హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్లలో భారీగా పరుగులు చేయకపోవడమే. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంత్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. వాస్తవానికి గత ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఆటగాడికి లభించినంత ధర పంత్ కు లభించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. రిషబ్ పంత్ మీద విపరీతమైన నమ్మకంతో లక్నో జట్టు యాజమాన్యం 27 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. కానీ అతను ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. కెప్టెన్ గా తీసుకున్న నిర్ణయాలు ఢిల్లీ జట్టు మీద విఫల ఫలితాలు అందించగా.. హైదరాబాద్ జట్టు మీద సానుకూలమైన ఫలితాలు అందించాయి. రిషబ్ పంత్ తర్వాత సెకండ్ హైయెస్ట్ ప్రైస్ పలికిన పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. ఇటీవల అతడు 90+ పరుగుల స్కోర్ చేశాడు. జట్టు కోసం తన సెంచరీని కూడా వదులుకున్నాడు. గుజరాత్ జట్టుపై తల పడిన ఆ మ్యాచ్లో అయ్యర్ తనదైన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆ తరహా ఇన్నింగ్స్ పంత్ ఆడలేక పోతున్నాడు. అందువల్లే అతడు లక్నో జట్టుకు కెప్టెన్ గా పనికిరాడని బాబాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అందువల్లే రిమోట్ విసిరేసి టీవీ ని పగలగొట్టాడు.