ప్రజలకు శుభవార్త.. ఆ గ్రహాల్లో కూడా మనం హ్యాపీగా జీవించొచ్చట!

ప్రపంచ దేశాల్లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాసయోగ్యమైన స్థలాలు లేవు. దీంతో వ్యవసాయ భూములు సైతం అపార్టుమెంట్లుగా మారిపోతున్నాయి. మనుషులు ఇప్పటివరకు భూమి మీద తప్ప ఇతర గ్రహాల మీద జీవించడం సాధ్యం కాదనే భావనలో ఉన్నారు. అయితే తాజాగా జరిగిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఇతర గ్రహాల్లో సైతం మానవాళి సంతోషంగా జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నయని తేలింది. శాస్త్రవేత్తలు భూమితో పోల్చి చూస్తే మనుషులు జీవించడానికి మెరుగైన పరిస్థితులు ఉన్న మరో […]

Written By: Navya, Updated On : October 8, 2020 10:30 am
Follow us on

ప్రపంచ దేశాల్లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాసయోగ్యమైన స్థలాలు లేవు. దీంతో వ్యవసాయ భూములు సైతం అపార్టుమెంట్లుగా మారిపోతున్నాయి. మనుషులు ఇప్పటివరకు భూమి మీద తప్ప ఇతర గ్రహాల మీద జీవించడం సాధ్యం కాదనే భావనలో ఉన్నారు. అయితే తాజాగా జరిగిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఇతర గ్రహాల్లో సైతం మానవాళి సంతోషంగా జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నయని తేలింది.

శాస్త్రవేత్తలు భూమితో పోల్చి చూస్తే మనుషులు జీవించడానికి మెరుగైన పరిస్థితులు ఉన్న మరో 24 గ్రహాలను గుర్తించారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డిర్క్ షుల్జే మాకుచ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రోబయాలజీ జర్నల్‌ లో ఈ పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి.

శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన గ్రహాలు జీవించడానికి అనుకూలంగా ఉన్నాయని.. భూమితో పోల్చి చూస్తే ఆ గ్రహాలు పరిమాణం పరంగా పెద్దవని చెబుతున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ గ్రహాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని గ్రహాల్లో భూమి కంటే ఎక్కువగా తేమ ఉందని.. అందువల్ల అక్కడ మానవులు నివశించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

తాము గుర్తించిన గ్రహాలపై సులువుగా జీవం అభివృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహాల కక్ష్యలో తిరిగే నక్షత్రాలు సైతం భూమి కంటే పెద్దగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. షుల్జే మాకుచ్ 100 కాంతి సంవత్సరాల కంటే దూరంలో ఈ గ్రహాలు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. నాసాకు చెందిన ప్లేటో స్పేస్ టెలిస్కోప్, లువియర్ స్పేస్ అబ్జర్వేటరీ సహాయంతో ఈ పరిశోధనలు చేసినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.