
Renu Desai: పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన ఒక కామెంట్ వివాదానికి దారి తీసింది. ఏప్రిల్ 8న రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ బర్త్ డే. రేణు దేశాయ్ కి విజ్ఞప్తిగా పవన్ అభిమాని సందేశం పోస్ట్ చేశాడు. మేడం మా అన్న(పవన్ కళ్యాణ్) కొడుకును ఒకసారి చూపించండి. మాకు అకీరాను చూడాలని ఉంది. మీరు అకీరా ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరు అలా దాచడం కరెక్ట్ కాదు, అంటూ రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేశాడు. అకీరాను మా అన్న కొడుకు అనడాన్ని రేణు దేశాయ్ తీవ్రంగా తప్పుబట్టారు. అకీరా నా కొడుకు. నువ్వు ఒక తల్లికే పుట్టావా? మాట్లాడటం నేర్చుకో అని నెటిజెన్ పై విరుచుకు పడ్డారు.
సదరు నెటిజన్ కి మద్దతుగా పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అతను తప్పేం అన్నాడు. విషయం పెద్దది చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కదా. ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని ఇలా చేస్తున్నారని రేణు దేశాయ్ కి వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు. పవన్ అభిమానులతో ఆమెకు సోషల్ మీడియా యుద్ధం జరుగుతుండగా… ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ఒక మహిళ రేణు దేశాయ్, సమంతకు మద్దతుగా మాట్లాడారు. ఒక హీరో హీరోయిన్ విడాకులు తీసుకుంటే కేవలం హీరోయిన్ ని తప్పుబడతారు. రేణు దేశాయ్ చాలా సంఘర్షణకు గురయ్యారు. ఆమె రెండో పెళ్లి ప్రకటన చేసినప్పుడు ట్రోల్ చేశారు. భర్తకు దూరమైన మహిళకు సానుభూతి కాదు మనం మద్దతు ఇవ్వాలి. సమాజం తోడుగా ఉందన్న భరోసా ఇవ్వాలని… ఆ మహిళ వీడియోలో కామెంట్స్ చేశారు.

ఆ మహిళను ఉద్దేశిస్తూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ నా గురించి మాట్లాడుతుంటే కన్నీళ్లు ఆగలేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి. పొలిటికల్ పార్టీస్ కి అమ్ముడుపోయానని అంటున్నారు. ఆమె మాటలు విన్నాక నన్ను కూడా అర్థం చేసుకునేవాళ్ళు ఉన్నారనే ధైర్యం వచ్చింది… అని రేణు దేశాయ్ కామెంట్ చేశారు. ఆమె పోస్ట్ వైరల్ గా మారింది. కాగా రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది.
View this post on Instagram