Homeట్రెండింగ్ న్యూస్Kumari Aunty: కుమారి ఆంటీపై డీజే హరీష్.. రీమిక్స్ వీడియో అదిరిపోయింది పో!!

Kumari Aunty: కుమారి ఆంటీపై డీజే హరీష్.. రీమిక్స్ వీడియో అదిరిపోయింది పో!!

స్ట్రీట్‌ ఫుడ్‌ హోటల్‌తో కుమారి ఆంటీ ఎంత ఫేమస్‌ అయిందో.. ఆ హోటల్‌ను ట్రాఫిక్‌ పోలీసులు మూసివేసిన సమయంలోనే అంతకంటే ఎక్కువగా ఫేమస్‌ అయ్యారు. హోటల్‌ మూసివేయడంపై విమర్శలు వచ్చాయి.

Kumari Aunty: కుమారీ ఆంటీ.. ఇటీవల సోషల్‌ మీడియాతోపాటు, టీవీలు, పత్రికల్లో కనిపిస్తున్న పేరు. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడిజ వద్ద స్ట్రీ ఫుడ్‌ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీ బిజినెస్‌ సోషల్‌ మీడియా కారణంగా ఊపందుకుంది. యువతతోపాటు సెలబ్రిటీలు కూడా కుమారీ ఆంటీ ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపుతున్నారని నెట్టింట్లో ప్రచారం జరిగింది. బిగ్‌బాస్‌ రాబోయే సీజన్‌లోకి కుమారి ఆంటీని తీసుకెళ్లాలన్న క్యాంపెయిన్‌ కూడా నడిపించారు. దీంతో ఆమె ఫుల్‌ పాపులర్‌ అయింది.

హోటల్‌ మూసివేతతో..
స్ట్రీట్‌ ఫుడ్‌ హోటల్‌తో కుమారి ఆంటీ ఎంత ఫేమస్‌ అయిందో.. ఆ హోటల్‌ను ట్రాఫిక్‌ పోలీసులు మూసివేసిన సమయంలోనే అంతకంటే ఎక్కువగా ఫేమస్‌ అయ్యారు. హోటల్‌ మూసివేయడంపై విమర్శలు వచ్చాయి. కుమారి ఆంటీకి చాలా మంది మద్దతుగా నిలిచారు. దీంతో చివరకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. హోటల్‌ను సీజ్‌ చేయకుండా, ట్రాఫిక్‌ సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు.

తాజాగా ఫొటో..
ఇత కుమారీ ఆంటీ వాయిస్‌ చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. ‘మటన్‌ కర్రీ, చికెన్‌ కర్రీ, ఎగ్‌ పులుసు, బోటీ కర్రీ, హెడ్‌ కర్రీ, ఫిష్‌ ఫ్రై, చేపల పులుసు.. అంటూ అందరికీ వివరించడం, తర్వాత సింగల్‌ కర్రీ రూ.150, రెండు కర్రీలు 200, మీది రూ.500, మీది మొత్తం రూ.1000 అయింది. రెండు లివర్లు అంటూ మాట్లాడే మాటలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ మాటలనే డీజే మిక్స్‌చేసి సాంగ్‌ చేశాడు ఓ నెటిజన్‌. దిస్‌ సాంగ్‌ మిక్స్‌సై డీజే హరీశ్‌ నెల్లూర్‌ అంటూ.. కుమారీ ఆంటీ మాటలతో పాట తయారు చేశాడు. ఇప్పుడు ఇది కూడా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సూపర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by (@harishthatiboina)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper