Syed Sohel: సోహెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఈయన సుపరిచితమే. ఇక ఈ మధ్య సినిమాల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4తో పాపులారిటీ సొంతం చేసుకున్న నటుడు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. విన్నర్ గా నిలవకున్నా కూడా బిగ్ బాస్ సీజన్ 4 విజేత కంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆయన బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్నారు.
మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, లక్కీ లక్ష్మణ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పెద్దగా వసూళ్లు మాత్రం రాలేదు అంటూ సోహెల్ గతంలోనే పేర్కొన్నారు. తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ హీరో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఫ్యామిలీతో చూసే సినిమాలు చేయమంటారు. తీస్తే థియేటర్లకు రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహెల్ సోహెల్ అన్నారు. ఇప్పుడు ఎందుకు నా సినిమాలు చూసేందుకు మీరు మీ ఫ్యామిలీస్ తో థియేటర్లకు రావడం లేదు అంటూ ప్రశ్నించారు సోహెల్. నా సినిమాలను ఫ్యాన్స్ ఎందుకు సపోర్ట్ చేయడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఈ రోజుల్లో క్లీన్ ఫ్యామిలీ సినిమాలు చేయడం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. మరి ఇప్పుడు క్లీన్ ఫ్యామిలీ సినిమా తీసినా కూడా ఎందుకు ఫ్యామిలీతో కలిసి రావడం లేదు అంటూ సోహెల్ బాధ పడ్డారు. ఈయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.