Relationship: ఒక్కోసారి ఒక్కో విషయం ట్రెండ్ అవుతుంటుంది. ఇలాంటి విషయాలను చాలా మంది పాటిస్తుంటారు కూడా. అయితే ఈ మధ్య స్లీప్ డైవర్స్ అనే పదం చాలా ట్రెండ్ అవుతుంది. డైవర్సా? అది కూడా స్లీప్ డైవర్స్ అంటే నిద్రకే డైవర్స్ తీసుకుంటారా అంటే పొరపాటు పడినట్టే.. మరి దంపతులు తీసుకుంటారా? నిద్ర కోసం అనుకుంటే పొరపడినట్టే. ఇంతకీ ఏంటి ఈ స్లీప్ డైవర్స్ అనేది చూసేయండి..
భార్యాభర్తల దాంపత్యం బాగుండాలి అంటే కచ్చితంగా ఒకే గదిలో పడుకోవాలి. ఒకే గది, ఒకే మంచం ఇద్దరి జీవితాన్ని సుఖంగా చేస్తుందంటారు నిపుణులు. అయితే కొన్ని కారణాల వల్ల జంటల మధ్య గొడవలు, ఇతర సమస్యలు వస్తున్నాయి. ఆ దూరాలు వారు నిజంగా విడిపోయేవరకు తెచ్చుకోకూడదు. అయితే వేర్వేరు గదుల్లో పడుకుంటే విడాకుల గురించి ఊహాగానాలు వస్తాయి. అయితే ఈ నిద్ర విడాకులు వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి జంటలలో పెరుగుతున్న ధోరణి. ఇందులో ఒకే గదిలో ఇద్దరూ కలిసి పడుకునే బదులు, వేర్వేరు గదులలో పడుకోవడం. లేదా వేర్వేరు బెడ్ లపై నిద్రించడం చేస్తారు.
మరికొందరు అయితే వేర్వేరు సమయాన్ని కూడా ఎంచుకుంటారు. నిజానికి ఈ ట్రెండ్ దంపతుల మధ్య బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఎందుకంటే భాగస్వామి నిద్రలో అసమానతలు ఉన్నప్పుడు మరో వ్యక్తి మంచి నిద్ర పోవాలి. భాగస్వామితో రిలేషన్ షిప్ లో మాధుర్యం ఉండాలి. ఒకవేళ ఒకరికి గురక ఎక్కువగా ఉంటే భాగస్వామికి ఇబ్బందే. లేదంటే ఒంటిరిగా పడుకోవాలనుకోవాలని కొందరికి అనిపిస్తుంది. కొన్ని సమయాల్లో కలిసి పడుకునే బదులు విడివిడిగా నిద్ర పోవడానికే ఇష్టపడుతారు. దీన్నే నిద్ర విడాకులు అంటారు.
మంచి నిద్ర పొందడానికి వేర్వేరు బెడ్ రూమ్ లలో నిద్రించడానికి ఇష్టపడతారు. పరిస్థితిని బట్టి, నిద్ర విడాకులు దీర్ఘకాలికంగా లేదా తాత్కాలికంగా ఉండవచ్చు. దంపతులు నిద్రలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కలిసి పడుకునే సమయాల్లో కొందరికి కొన్ని రకాల అలవాట్లతో ఇబ్బంది కలగవచ్చు. అందుకే వేరు వేరుగా పడుకోవాలి అనుకుంటున్నారు. ఇదే క్రమంగా దంపతుల మధ్య స్లీప్ డివోర్స్ గా మారింది.