Mohan Babu-Rajinikanth: మోహన్ బాబు కోసం రజినీకాంత్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..?

రజనీకాంత్ మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగాడు, కానీ మోహన్ బాబు మాత్రం హీరోగా కొన్ని సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి, తను మాత్రం స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.

Written By: Gopi, Updated On : February 20, 2024 2:04 pm
Follow us on

Mohan Babu-Rajinikanth: సినిమా ఇండస్ట్రీలో నటుల మధ్య పోటీ ఉంటుంది కానీ కొంతమంది నటులు మధ్య మాత్రం మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఒకరి సినిమాల గురించి ఒకరు డిస్కస్ చేసుకుంటూ చాలా హెల్తీ వాతావరణం లో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోలుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి కోవ కు చెందిన వారే రజనీకాంత్, మోహన్ బాబు.

వీళ్లిద్దరూ కెరియర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల్లో కలిసి నటించినప్పటికీ రజనీకాంత్ మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగాడు, కానీ మోహన్ బాబు మాత్రం హీరోగా కొన్ని సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి, తను మాత్రం స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్, మోహన్ బాబుని స్టార్ హీరో గా చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశాడు.

అందులో భాగంగానే ఆయనే కొంతమంది డైరెక్టర్లను రిఫర్ చేసి మరి మోహన్ బాబుతో సినిమాలు చేయించాడు. అందులో భాగంగానే రవిరాజా పినిశెట్టి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. అలాంటి స్టార్ డైరెక్టర్ మోహన్ బాబు తో సినిమా చేసినప్పటికీ ఆయన స్టార్ హీరో అవ్వాలేకపోయాడు. అయితే రజినీకాంత్ వల్లే మోహన్ బాబు పెదరాయుడు సినిమా చేశాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికి ఆ తర్వాత మోహన్ బాబు కి వరుస ఫెయిల్యూర్స్ వచ్చాయి. అందువల్లే తను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కంటిన్యూస్ గా కొనసాగలేకపోయాడు. ఇక వీళ్ళ ఫ్రెండ్షిప్ లో మోహన్ బాబు రజనీకాంత్ కి చేసిన దానికంటే, రజనీకాంత్ మోహన్ బాబుకి చేసిందే ఎక్కువ అని చాలామంది అభిమానులు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ ఉంటారు.

ఇక మొత్తానికైతే తన ఫ్రెండ్ ను స్టార్ హీరోగా చూడాలి అనుకున్న రజనీకాంత్ కల నెరవేరలేదు. అప్పట్లో మోహన్ బాబు వరుస సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో నిదానంగా ఆయన మార్కెట్ డౌన్ అవుతూ వచ్చింది. ఇంకా దాంట్లో భాగంగానే ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పటికి కూడా అవకాశం వస్తే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది…