Ram Charan – Jr NTR : ఇటీవలే మన తెలుగు సినిమా #RRR చిత్రానికి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం #RRR మూవీ టీం ఈ సక్సెస్ లో మునిగి తేలుతుంది.బాషా ప్రాంతం అని తేడా లేకుండా అందరూ ఒక తాటిపైకి వచ్చి ఇది మా ఇండియన్ సినిమా అని చెప్పుకునేలా చేసిన ఈ చిత్రాన్ని మనం జీవితాంతం మర్చిపోలేం.అయితే అంతా బాగానే ఉంది కానీ,అభిమానులకు రామ్ చరణ్ – ఎన్టీఆర్ విషయం లో ఒక చిన్న అసంతృప్తి ఉంది.
అదేమిటంటే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేదిక మీద ‘నాటు నాటు’ పాటకి లైవ్ డ్యాన్స్ వేస్తారని అనుకున్నారు.అభిమానులంతా ఈ పెర్ఫార్మన్స్ కోసం ఎంతగానో ఎదురు చూసారు.రాహుల్ సిప్లిగంజ్ మరియు కాళ భైరవ లైవ్ గా పాట అయితే పాడారు కానీ, రామ్ చరణ్ – ఎన్టీఆర్ డ్యాన్స్ వేయకపోవడం అందరినీ నిరాశకి గురి చేసింది.
అయితే వీళ్ళు పెర్ఫార్మ్ చేయకపోవడానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ అట.ఎందుకంటే తారకరత్న చనిపోవడం తో ఆయన మార్చి 6 వ తేదీ వరకు ఇండియాలోనే ఉన్నాడు, ఆ తర్వాత అమెరికా కి పయనం అయ్యి ప్రొమోషన్స్ లో పాల్గొన్నాడు.కానీ రామ్ చరణ్ , రాజమౌళి మాత్రం ఫిబ్రవరి నెలాఖరు లోపే అమెరికా కి వెళ్లి అక్కడ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్నారు.ఒకవేళ వాళ్ళతో పాటు ఎన్టీఆర్ కూడా వచ్చునంటే రిహార్సల్స్ ఉండేవి, ఆస్కార్ స్టేజి మీద డ్యాన్స్ ఉండేది అని అంటున్నారు విశ్లేషకులు.
ప్రముఖ నిర్మాత రాజ్ కపూర్ మాట్లాడుతూ ‘ఫిబ్రవరి నెలలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కి ఆస్కార్స్ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆహ్వానం లభించింది.వాళ్ళు నాటు నాటు పాటకి డ్యాన్స్ చేసేవాళ్ళే, కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చేయలేకపోయారు’ అంటూ చెప్పుకొచ్చాడు.ఏది ఏమైనా వీళ్లిద్దరు ఆస్కార్ వేదిక మీద డ్యాన్స్ వేసి ఉంటే మన తెలుగు ప్రేక్షకులు చిరకాలం పదిలంగా దాచుకునే మెమరీ గా నిలిచిపొయ్యేది.