‘అటల్ టన్నెల్’ తో దేశానికి ఏం ఉపయోగం?

9.02 కిలోమీటర్లు.. సముద్ర మట్టానికి 10,340 అడుగుల ఎత్తులో నిర్మించిన అటల్‌ టన్నెల్‌ను నిన్న ప్రధాని మోడీ ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్ తంగ్ పాస్ వైపు నుంచి మోడీ సొరంగంలో ప్రయాణించారు. టన్నెల్ దక్షిణ ముఖద్వారం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటే ఉత్తర ముఖద్వారం లడ్డాఖ్ లో ఉంది. ఈ రెండింటి మధ్య కొండలను తొలిచి ఈటన్నెల్‌ను నిర్మించారు. అయితే.. ఇది ప్రపంచంలోనే ఎంతో పొడవైన టన్నెల్‌గా రికార్డుల్లోకి కూడా ఎక్కింది. అత్యాధునిక టెక్నాలజీతో.. బయటగాలి వేగం, […]

Written By: NARESH, Updated On : October 4, 2020 5:47 pm
Follow us on


9.02 కిలోమీటర్లు.. సముద్ర మట్టానికి 10,340 అడుగుల ఎత్తులో నిర్మించిన అటల్‌ టన్నెల్‌ను నిన్న ప్రధాని మోడీ ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్ తంగ్ పాస్ వైపు నుంచి మోడీ సొరంగంలో ప్రయాణించారు. టన్నెల్ దక్షిణ ముఖద్వారం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటే ఉత్తర ముఖద్వారం లడ్డాఖ్ లో ఉంది. ఈ రెండింటి మధ్య కొండలను తొలిచి ఈటన్నెల్‌ను నిర్మించారు. అయితే.. ఇది ప్రపంచంలోనే ఎంతో పొడవైన టన్నెల్‌గా రికార్డుల్లోకి కూడా ఎక్కింది. అత్యాధునిక టెక్నాలజీతో.. బయటగాలి వేగం, ఆక్సిజన్ లెవల్స్ లాంటివి తెలిపేలా టన్నెల్లో చేశారు. అలాగే కమ్యూనికేషన్ కోసం ప్రతి అర కిలోమీటర్‌‌కు ఓ ల్యాండ్ ఫోన్‌ను అందుబాటులో పెట్టారు. టన్నెల్ నిర్మాణం జరగకముందు పై రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేయాలంటే సైనికులతో పాటు మామూలు జనాలు కూడా నానా అవస్థలు పడేవారు. ఈ టన్నెల్‌తో మన సైన్యానికి చాలా వరకు ఉపయోగాలున్నాయి.

Also Read: మారటోరియంలోనూ లోన్లు కట్టారా..! : మీకో శుభవార్త

రోహ్‌తంగ్‌ పాస్‌ లడ్డాఖ్‌ లేహ్‌ మధ్య ప్రయాణించాలంటే ఇప్పటివరకు కొండలను చుట్టుకొని.. సరస్సులను దాటుకొని వెళ్లాల్సి వచ్చేది. దాదాపు ఏడు గంటలకు పైగా సమయం పట్టేది. అలాంటి ప్రాంతాల మధ్య ఉన్న కొండలను తొలిచి టన్నెల్‌ను నిర్మించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్వో) నిపుణులు ఈ టన్నెల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. మొన్నటి వరకు పై ప్రాంతాల మధ్య ఉన్న రోడ్డులో ప్రయాణించాలంటే ఏడాది మొత్తం కేవలం నాలుగు నెలలు మాత్రమే సాధ్యమయ్యేది. శీతాకాలం, వర్షాకాలంలో రోడ్డు మూసివేయాల్సి వచ్చేది. మంచు తుఫానులు, విపరీతమైన మంచు కురవటంతో ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. అలాగే వర్షాకాలంలో కొండచరియలు జారిపడటం వల్ల కూడా ప్రయాణం సాగేది కాదు.

సైనికులు కాబట్టి వారికి ఏ అడ్డంకులు వచ్చినా తమ పనిని పూర్తిచేయాల్సిందే. ఈ రహదారి వెంట సామాన్య ప్రజలకు ఈ రెండు సీజన్లలోనూ ప్రయాణాలు సాధ్యపడేవి కావు. పై రోడ్డు మార్గం సైనికావసరాలకు ఎంతో వ్యూహాత్మక ప్రాంతం. హిమాలయాల్లో కాపలా కాసే సైన్యానికి ఏడాది పొడవునా ఆయుధాలు, ఆహారం, టెంట్లు తదితర అవసరాలను సరఫరా చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు హెలికాప్టర్లలో సరఫరా చేయగలిగినా అన్ని సార్లు కుదిరేది కాదు. అందుకనే ప్రధానమంత్రిగా వాజ్ పేయి ఉన్నప్పుడు ఈ టన్నెల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాత యూపీఏ ప్రభుత్వంలో కూడా పనులు జరిగాయి. 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పనుల్లో ఒక్కసారిగా వేగం అందుకుంది. ఇప్పుడు ఈ టన్నెల్‌ సైనికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. అటు ప్రజలు కూడా ఆ రెండు సీజన్లలోనూ రాకపోకలు సాగించొచ్చు.

Also Read: ట్రంప్ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ.!

అంతేకాదు.. ఈ టన్నెల్ నిర్మాణంతో ప్రయాణంలో 7 గంటలు, 45 కిలోమీటర్లు కూడా కలిసి వస్తుంది. మంచు, ఇతర కారణాలతో టన్నెల్‌ మూసివేసే పరిస్థితి కూడా ఉండదు. మనదేశం ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అత్యాధునిక టెక్నాలజీలతో ఏర్పాటు చేసుకుంటుందనే అటు.. డ్రాగన్‌, పాకిస్థాన్‌ దేశాలు కుల్లుకుంటున్నాయి.