
RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఏదైనా ఉందంటే టక్కుమని చెప్పే పేరు ఆర్సీబీ. ఈ లీగ్ ప్రారంభమై ఇప్పటి వరకు 15 ఎడిషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 16వ ఎడిషన్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు సాధించలేని జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ జట్టు మాత్రమే. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ జట్టుగా బరిలో దిగుతూనే.. పేలవమైన ప్రదర్శనతో కప్పు సాధించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఈ జట్టుకు ఏర్పడుతోంది. కప్పు సాధించకపోవడమే కాకుండా మరో చెత్త రికార్డును తాజాగా ఆర్సీబీ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఆ రికార్డు ఏమిటో మీరు చదివేయండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసి డిఫెండ్ చేసుకో లేకపోయినా జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఐదు సార్లు 200కుపైగా పరుగులు చేసి కూడా ఆర్సీబీ జట్టు ఓటమి పాలైంది. ఆర్సీబీ జట్టు తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రెండుసార్లు మాత్రమే 200కుపైగా పరుగులు చేసి డిఫెండ్ చేసుకోలేక ఓటమిపాలయ్యాయి. అత్యధికంగా ఐదుసార్లు ఆర్సీబీ జట్టు 200కుపైగా పరుగులు చేసి ఓటమి పాలయింది. తాజాగా లక్నోతో సోమవారం జరిగిన మ్యాచ్ లో 212 పరుగులు చేసినప్పటికీ కాపాడుకోలేకపోయింది ఆర్సీబీ జట్టు. లక్నో జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ అరవీర భయంకరమైన బ్యాటింగ్ తో విజయాన్ని అందించి పెట్టాడు.
ఐదుసార్లు ఓటమిపాలైన ఆర్సీబీ జట్టు..
బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేసి కూడా ఐదు సార్లు ఓటమి పాలైంది. వీటిలో తాజాగా సోమవారం లక్నో తో జరిగిన మ్యాచ్ లో చేసిన 212 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. 213 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. గతంలో నాలుగు సార్లు ఇలానే బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు 205 పరుగులు చేసింది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి విజయం సాధించింది. అలాగే బెంగుళూరు వేదికగా అయితే జరిగిన మ్యాచ్ లో మరోసారి 205 పరుగులు చేసిన బెంగుళూరు జట్టు.. డిఫెండ్ చేసుకోలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి విజయం సాధించింది. అలాగే ముచ్చటగా మూడోసారి కూడా 205 పరుగులు చేసిన బెంగళూరు జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో కూడా చెన్నై జట్టు 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. అలాగే, కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఒక మ్యాచ్ లో మళ్లీ బెంగళూరు జట్టు 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కూడా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నాలుగు మ్యాచ్ ల్లోనూ బెంగళూరు జట్టు 205 పరుగులు చేయగా, ఐదు వికెట్ల తేడాతో రెండుసార్లు చెన్నై జట్టు, ఒకసారి పంజాబ్, మరోసారి కోల్ కతా జట్టు 5 వికెట్లు తేడాతోనే విజయం సాధించడం గమనార్హం.
బెంగళూరుకు కలిసి రాని 205 పరుగులు..
బెంగళూరు జట్టు 200కుపైగా పరుగులు చేసి ఐదు సార్లు ఓటమి చెందింది. ఇందులో నాలుగు సార్లు 205 పరుగులు చేయగా, తాజాగా లక్నో తో మ్యాచ్ లో 212 పరుగులు చేసింది. 205 పరుగులు చేసిన నాలుగు సార్లు బెంగళూరు జట్టు ఘోరంగా ఓటమి రుచి చూసింది. నాలుగుసార్లు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోగా, లక్నోతో మ్యాచ్ లో మాత్రం ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్లి అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. అయినప్పటికీ చివరికి లక్నో జట్టునే విజయం వరించింది. దీంతో 200 కుపైగా టార్గెట్ విధించడం బెంగళూరుకు కలిసి రాదనే విషయం స్పష్టమైంది.

మూడుసార్లు సొంత మైదానంలోనే బోల్తా పడిన బెంగుళూరు..
200కుపైగా పరుగులు చేసిన తర్వాత ఐదు సార్లు బెంగళూరు జట్టు ఓటమి పాలు కాగా.. మూడుసార్లు సొంత మైదానం బెంగళూరులోనే కావడం గమనార్హం. లక్నో తో జరిగిన తాజా సోమవారం నాటి మ్యాచ్ లో, కోల్ కతాతో జరిగిన ఒక మ్యాచ్ లో, చెన్నై తో జరిగిన మరో మ్యాచ్ లో సొంత మైదానం బెంగళూరులో జట్టు ఓటమి చెందింది.
ఒకసారి దక్కిన విజయం..
200కు పైగా పరుగులు చేసిన ప్రతిసారి ఓటమిపాలైన బెంగళూరు జట్టు.. 200 పైగా పరుగుల లక్ష్యాన్ని ఒకసారి మాత్రం చేజ్ చేసింది. పంజాబ్ జట్టు విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేజ్ చేసింది. ఈ విజయం బెంగళూరు వేదికగా దక్కడం ఆ జట్టుకు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. గతంలో నాలుగుసార్లు చేసిన 205 పరుగులు ఓటమిని అందిస్తే, ఈ సారి అవే పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది.
ఏది ఏమైనా ఐదుసార్లు భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోలేక బెంగళూరు జట్టు చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.