
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అందం పెరుగుతుంటే వయసు తగ్గుతుంది. ఈ చందమామ గ్లామర్ వెన్నెలలా విరజిమ్ముతుంది. కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. అందం అంటే మీదే అంటూ కొనియాడుతున్నారు. సమ్మర్ వేర్ ధరించిన కాజల్ సూపర్ హాట్ గ్లామరస్ గా దర్శనమిచ్చారు. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కాజల్ టీనేజ్ గ్లామర్ మైంటైన్ చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 అక్టోబర్ లో ఆమె గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళైన వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. గత ఏడాది కాజల్ అబ్బాయికి జన్మనిచ్చారు. లాక్ డౌన్ టైం కావడంతో పెళ్లి, ప్రెగ్నెన్సీ కెరీర్ కి ఎలాంటి ఆటంకం కలిగించలేదు.

తల్లయ్యాక కాజల్ కొంచెం ఒళ్ళు చేసినట్లు కనిపించారు. కఠిన కసరత్తులు చేసి మరలా పూర్వస్థితికి వచ్చారు. వివాహమైనప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారీ ఆఫర్స్ దక్కించుకుంటూ జోరు చూపిస్తుంది. నందమూరి నటసింహం బాలకృష్ణకు జంటగా కాజల్ నటిస్తున్నారు. బాలయ్య 108వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది.
కాజల్ చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన ఈ మూవీ తిరిగి ప్రారంభమైంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. 1996లో విడుదలైన ఇండస్ట్రీ హిట్ భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. రకుల్ ప్రీత్ మరొక హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

నటిగా కాజల్ ప్రస్థానం 2004లో ప్రారంభమైంది. 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్ అయ్యారు. దర్శకుడు తేజా ఆమెకు హీరోయిన్ ఆఫర్ ఇచ్చారు. చందమామ, మగధీర చిత్రాలతో పరిశ్రమలో నిలదొక్కుకుంది. సౌత్ ఇండియా స్టార్ లేడీగా కాజల్ వెలిగిపోయారు. రెండు తరాల టాప్ స్టార్స్ తో కాజల్ నటించారు. ఆమె కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.