Khiladi Review: మూవీ రివ్యూ : ఖిలాడీ

నటీనటులు & సిబ్బంది రచన, దర్శకత్వం : రమేష్ వర్మ నిర్మాత: సత్యనారాయణ కోనేరు సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్ ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: రవితేజ, అర్జున్, ఉన్ని ముకుందన్ ,మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి Raviteja khiladi movie review 2022 : రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ మూవీ ఈరోజు విడుదలైంది. ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సీనియర్ నటుడు అర్జున్ , […]

Written By: NARESH, Updated On : February 11, 2022 11:14 am
Follow us on

నటీనటులు & సిబ్బంది
రచన, దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రవితేజ, అర్జున్, ఉన్ని ముకుందన్ ,మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి

Raviteja khiladi movie review 2022 : రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ మూవీ ఈరోజు విడుదలైంది. ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సీనియర్ నటుడు అర్జున్ , ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కల్లోలం లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించగలిగింది.. ఈ యాక్షన్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. మరి ‘ఖిలాడీ’ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

-కథ
ఖిలాడీ మూవీ మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మాస్ యాక్షన్ డ్రామాగా అభివర్ణింవచ్చు. రవితేజ ఈ సినిమాలో ఓ ‘గ్యాంబ్లర్’గా నటించాడు. పెద్ద ఖిలాడీగా ‘మోహన్ గాంధీ’ అనే పాత్ర పోషించాడు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటుడు అర్జున్ కనిపించారు. హీరోయిన్ గా డింపుల్ హయతీ నటించారు. ప్రధానంగా కథ చూస్తే.. ఒక డబ్బు ఉన్న కంటెయినర్ ను రవితేజ దోచుకోవడంతో కథ మొదలవుతుంది.. పోలీస్ ఆఫీసర్ తోపాటు సినిమాలో విలన్లు కూడా ఆ కంటెయినర్ ఎక్కడ రవితేజ దాచాడో తెలియక తీవ్రంగా వెతుకుతుంటారు. రవితేజ ఆ మనీ కంటెయినర్ లోనే కూర్చొని పోలీస్, విలన్లకు సవాళ్లు విసురుతుంటాడు. ముప్పు తిప్పలు పెడుతాడు. చివరకు ఆ మనీ పోలీసులకు చిక్కిందా? లేదా విలన్ల వశం అయ్యిందా? రవితేజ ఏం చేశాడు? అన్నది ప్రధాన కథ. దీనికి మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ జత చేసి సినిమా సాగించాడు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు, పంచ్ డైలాగ్స్ మాత్రం బాగున్నాయంటున్నారు.

Also Read: తెలుగులో ప్రభాస్ తర్వాత ఆ హీరోతో నటించడం తన డ్రీమ్ అన్న దీపికా పదుకొణే

-సాంకేతిక వర్గం
రమేష్ వర్మ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన మాస్ మహారాజా రెండవ చిత్రం కావడం విశేషం.. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ ఖిలాడీ మూవీని హిందీలో ప్రముఖ సంస్థ పెన్ స్టూడియోస్ మరియు ఎ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నాయి. నికితిన్ ధీర్, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రిషి, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ మరియు అనసూయ భరద్వాజ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఖిలాడీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సుజిత్ వాసుదేవ్, జికె విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. అమర్‌రెడ్డి కుడుముల ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టారు.

Khiladi

– విశ్లేషణ
సినిమాలో నటన విషయానికి వస్తే.. రవితేజ నటనకు మంచి గుర్తింపు లభించినప్పటికీ, సినిమాకు ఎంచుకున్న రొటీన్ కథాంశం నిరాశపరిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హై యాక్షన్ స్టంట్స్.. గ్రిప్పింగ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హై పాయింట్స్. అయితే ఖిలాడీ విమర్శకుల నుండి అనుకూలమైన రివ్యూలను కూడా పొందుతోంది. ఇది బాక్సాఫీస్ వద్ద చిత్రానికి అనుకూలంగా మారింది. పెద్ద సినిమాలు ఏవీ పోటీలేకపోవడంతో ఖిలాడీ రవితేజ ప్రస్తుతానికి విజయవంతమైన హిట్‌గా మారవచ్చు.

-ఫైనల్ గా..
ఖిలాడి మూవీ ఇటీవలి నెలల్లో విడుదలైన చిత్రాల్లోనే ఒక సాగదీత చిత్రంగా చెప్పొచ్చు. సినిమా చూస్తుంటే దర్శకుడికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాదు. తేలిపోయిన కథనం, పేలవమైన సినిమాటోగ్రఫీ, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా మరింత చెడిపోయింది. చాలా సన్నివేశాలకు కనీస లైటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ లోపించింది. భారీ తారాగణం, రెండు భారీ బడ్జెట్ యాక్షన్ సన్నివేశాలు, రెండు మాస్ పాటలు వృధా అయ్యాయి. రవితేజ అభిమానులు కూడా హ్యాపీగా ఈ సినిమా చూసి బయటకు రారని చెప్పొచ్చు. సినిమాలేవీ పోటీ లేకపోవడంతో ఒకసారి చూసే సినిమాగానే దీన్ని అభివర్ణింవచ్చు.

oktelugu.com రేటింగ్: 2.25/5

Also Read: టాలీవుడ్ విశాఖకు రావాల్సిందే.. జగన్ కోరిక అదే