
Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బరస్ట్ అయ్యారు. ప్రేమికుల రోజు స్పెషల్ ఎపిసోడ్ వేదికగా ఆమె లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. కన్నీరు పెట్టుకున్న రష్మీ గౌతమ్ ని చూసి షోలో ఉన్న వారంతా వేదనకు గురయ్యారు. ఫిబ్రవరి 14 వస్తున్న నేపథ్యంలో ప్రేమికుల రోజు స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. బుల్లితెర సెలెబ్రిటీలలో పెళ్ళైన జంటలు, ప్రేమించుకుంటున్న జంటలు వేదికపైకి వచ్చారు. రాకింగ్ రాకేష్ కి కాబోయే భార్య సుజాత బ్రేస్ లెట్ కానుకగా ఇచ్చింది.
ఇటీవల రాకేష్-సుజాతల నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరు వివాహం చేసుకోబోతున్నారు. పంచ్ ప్రసాద్ తన భార్యతో వేదిక పంచుకున్నారు. నాకేమి గిఫ్ట్ తెచ్చావని అడగ్గా… తెచ్చానండీ అంటూ టాబ్లెట్స్ ఇచ్చింది. కొన్నాళ్లుగా పంచ్ ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన ఆరోగ్యంపై ఇలా ఓ కామెడీ పంచ్ వేశారు. కాగా రష్మీ గౌతమ్ పై హైపర్ ఆది దారుణమైన పంచ్లు వేశారు. నేను ఆయనకి ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, అని రష్మీ అనగా. అది నాకివ్వు నేను తీసుకెళ్లి ఇచ్చేస్తాను అన్నాడు. సుడిగాలి సుధీర్ ని ఉద్దేశిస్తూ ‘బాబు నువ్వు ఏదో ఒకటి చెప్పండి. సడన్ గా మాకు బాబు అని మాత్రం చెప్పకండని’ షాకింగ్ సెటైర్ వేశాడు.

ఇక ఎపిసోడ్ చివర్లో ఎమోషనల్ సిట్యుయేషన్ చోటు చేసుకుంది. రష్మీ తనకు బ్రేకప్ అయ్యిందని కన్నీరు పెట్టుకుంది. రష్మీ ఏడవడం చూసి షో మొత్తం ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది. కంటెస్టెంట్స్, జడ్జెస్ ముఖాలు దీనంగా పెట్టారు. అసలు రష్మీ ప్రేమించింది ఎవరిని? ఎందుకు బ్రేకప్ అయ్యింది? అనే విషయాలు తెలియాలంటే వచ్చే ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ చూడాలి.
రష్మీ లవర్ ఎవరనే విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు. బుల్లితెరపై ఆమె సుడిగాలి సుధీర్ తో రొమాన్స్ చేసిన నేపథ్యంలో… అతనే రష్మీ ప్రేమికుడిని చాలా మంది నమ్ముతారు. అయితే మా మధ్య అలాంటి రిలేషన్ లేదు. మిత్రులం మాత్రమే చెప్పుకొస్తూ ఉంటారు. పెళ్ళికి ఏజ్ బార్ అవుతున్నా సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. సుధీర్ అటు యాంకర్ గా ఇటు హీరోగా రాణిస్తున్నారు. రష్మీ కెరీర్ సైతం పీక్స్ లో ఉంది.