
Nijam With Smitha: ఇప్పుడు అసలే ఓటీటీ రోజులు కాబట్టి.. జనాలకు టీవీలు, సినిమా థియేటర్ల మీద ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి… కొత్త కొత్త కంటెంట్ ను ఇష్టపడుతున్నారు.. తమను ఏది రంజింపజేస్తుందో దానికే ఓటేస్తున్నారు. సారీ సబ్ స్క్రిప్షన్ చేసుకుంటున్నారు.. ఇక గ్లోబల్ మార్కెట్లో ఇండియా పెద్ద లీడర్ కాబట్టి… పెద్దపెద్ద ఎంటర్టైన్మెంట్ కంపెనీలు ఎప్పటినుంచో ఇండియా మీద ఫోకస్ చేశాయి.. సోనీ, డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటివి భారీగా పెట్టుబడులు పెట్టాయి.. స్థానిక ప్రజలను ఆకట్టుకునేలా కంటెంట్ నిర్మించకపోవడంతో నానాటికి ఆదరణ కోల్పోతున్నాయి. ఇదే సమయంలో లోకల్ మేడ్ ఓ టీటీలు దుమ్ము రేపుతున్నాయి. అల్ట్ బాలాజీ, ఆహా, వూట్ వంటి ఓటీటీలు జనాదరణ పొందడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి.. టాక్ షో లు, కామెడీ ఎక్స్చేంజి లాంటి ప్రోగ్రాములు, ఇండియన్ ఐడల్ లాంటి పోటీలు నిర్వహిస్తున్నాయి. దీనివల్ల లోకల్ ఆడియన్స్ కు రీచ్ అవుతున్నాయి.. ఉదాహరణకు ఆహా ఓటీటీ ని తీసుకుంటే అన్ స్టాపబుల్ పేరుతో హీరో బాలకృష్ణతో రెండు సీజన్లు టాక్ షోలు నిర్వహించింది.. దీనివల్ల జనాల్లోకి త్వరగా రీచ్ అయింది.. ఏకంగా కోటి మందికి పైచిలుకు సబ్ స్క్రైబర్లను సంపాదించుకుంది.. వయా కాం స్టూడియోస్ ప్రమోట్ చేస్తున్న వుట్ యాప్ కూడా లోకల్ కంటెంట్ కు ప్రయారిటీ ఇస్తుండడంతో 10 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.. ఈ కథనం రాసే సమయానికి ఆ సంఖ్య ఇంకా ఎక్కువ పెరగవచ్చు.
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచిలో మార్పు రావడంతో ఓటీటీ సంస్థలు సరికొత్త పంథా వైపు ప్రయాణిస్తున్నాయి. అయితే వీటిలో విభిన్నమైన కంటెంట్ ఎంచుకున్న సంస్థలే ప్రేక్షకుల ఆదరణ చురగొంటున్నాయి.. అలా ప్రయోగాలు చేయలేని సంస్థలు కొత్త సినిమాల కొనుగోలుతోనే సరిపెట్టుకుంటున్నాయి.. ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ 100 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లతో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఇది విదేశానికి చెందిన కంపెనీ కావడంతో… ఇంగ్లీష్ సినిమాలనే ఎక్కువగా స్ట్రీమ్ చేస్తోంది. దీనికి తోడు వెబ్ సిరీస్ లు కూడా నిర్మించి స్ట్రీమ్ చేస్తోంది.. అయితే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ భాషలో ఉండటంతో స్థానిక జనానికి అంతగా కనెక్ట్ కావడం లేదు.. ఇండియా గ్లోబల్ మార్కెట్ కావడంతో దాని రీచ్ అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఇక డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ కూడా నెట్ ఫ్లిక్స్ మాదిరే నడుచుకుంటున్నాయి. ఈ సంస్థలకు చేరో 50 కోట్ల చొప్పున సబ్ స్క్రైబర్లు ఉన్నారు..
లోకల్ ఓటీటీ లు దున్నేస్తున్నాయి
ఇక వెస్ట్రన్ ఓటీటీ లతో పోల్చుకుంటే స్థానికంగా ఉన్న ఓటీటీలు మార్కెట్ ను దున్నేస్తున్నాయి. మొన్నటిదాకా ఆహాకు 30 లక్షల సబ్స్క్రైబర్లు మాత్రమే ఉండేవారు.. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరింది. మునుముందు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆల్ట్ బాలాజీ కూడా కోటి మంది సబ్స్క్రైబర్లతో అల రారుతోంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ జనం పెద్దగా లెక్కచేయడం లేదు.. ఇందుకు కారణం లోకల్ కంటెంట్.

ఇక హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తో పోల్చుకుంటే సోనీ లీవ్ రీచ్ తక్కువ. ఇటీవల అది భారీగానే తెలుగు సినిమాలు కొనుగోలు చేసినప్పటికీ… రీచ్ అంతగా పెరగడం లేదు.. ఈ క్రమంలో లోకల్ కంటెంట్ పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టాక్ షోలు ప్లాన్ చేస్తోంది..ప్రముఖ పాప్ గాయని స్మితతో నిజం విత్ స్మిత అనే టాక్ షో నిర్మించింది.. త్వరలో ఇది స్ట్రీమ్ కాబోతోంది. నారా చంద్రబాబు నాయుడు, చిరంజీవి, నాని, రానా, చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసింది.. ప్రోమోలో బోల్డ్ క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తోంది.. ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.. మొత్తానికి తెలుగు మార్కెట్లో నిలబడేందుకు సోనీ లీవ్ గట్టి ప్రయత్నమే చేసింది.. మరి మిగతా ఓటీటీలు ఏం చేస్తాయో చూడాలి. అన్నట్టు నెట్ ప్లిక్స్ కూడా భారీగా తెలుగు సినిమాలు కొనుగోలు చేసింది.. చూస్తుంటే ముందు ముందు రోజుల్లో పోటీ మరింత తీవ్రతరం కాబోతోంది అని అర్థమవుతోంది.