Rashmika Mandanna: రష్మిక మందాన ప్రస్తుతం స్టార్ లేడీ. పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్. సినిమాకు నాలుగైదు కోట్లు తీసుకుంటున్న హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్. అయితే బాల్యంలో రష్మిక అనేక ఇబ్బందులు చూశారట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన రష్మిక ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారట. ప్రతినెలా ఇంటి రెంట్ కట్టే స్తోమత కూడా ఉండేది కాదట. ఆ కారణంగా రెండు మూడు నెలలకోసారి ఇల్లు మారాల్సి వచ్చేదట. అద్దె ఇళ్ల కోసం వీధులు పట్టుకొని తిరిగామని గతకాలపు చేదు అనుభవాలు రష్మిక మందాన ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.

తాజాగా రష్మిక మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. రష్మిక చిన్నప్పటి నుండి హాస్టల్ ఉండి చదువుకున్నారట. ఆమె చదువులో బాగా వీక్ అట. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చాక డిగ్రీలో ఆలస్యంగా జాయిన్ అయ్యారట. తనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెద్దగా ఉండేవి కాదట. దీంతో తోటి స్టూడెంట్స్ తో సరిగా మాట్లాడలేకపోయేదట. ఈ కారణంగా అందరూ తనను అపార్థం చేసుకునేవారట. దాంతో రాత్రివేళ నిద్రపోకుండా వెక్కివెక్కి ఏడ్చేదట. తనలోని ఈ భయాలను అమ్మ సహాయంతో అధిగమించారట. తల్లి చెప్పిన మాటలు తనను స్ట్రాంగ్ గా మార్చేశాయని రష్మిక వెల్లడించారు.
రష్మిక నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ లో జనవరి 20 నుండి స్ట్రీమ్ అవుతుంది. మిషన్ మజ్ను చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రష్మిక నటించిన సెకండ్ హిందీ మూవీ మిషన్ మజ్ను. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. ఇది యాక్షన్ స్పై థ్రిల్లర్ అని సమాచారం. ఇక వారసుడు మూవీతో రష్మిక మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. డివైడ్ టాక్ తెచ్చుకొని కూడా వారసుడు తెలుగు, తమిళ భాషల్లో చెప్పుకోదగ్గ విజయం సాధించింది.

ప్రస్తుతం రష్మిక చేతిలో యానిమల్, పుష్ప 2 వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండతో ఓ మూవీకి సైన్ చేశారనే ప్రచారం జరుగుతుంది. ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా రష్మిక-విజయ్ దేవరకొండ ఎఫైర్ రూమర్స్ మరింత జోరందుకున్నాయి. న్యూఇయర్ వేడుకల కోసం ఈ జంట మాల్దీవ్స్ వెళ్లారు. ఇదే విషయాన్ని రష్మికను అడిగితే… జంటగా వెకేషన్ కి వెళితే తప్పేంటి? అంత మాత్రాన లవ్ లో ఉన్నట్లేనా? అని ఎదురు ప్రశ్నిస్తుంది.