
Virupaksha: సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత ‘విరూపాక్ష’ అనే సినిమా ద్వారా మన ముందుకు రేపు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అటు మెగా ఫ్యాన్స్ లోను, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.ఎందుకంటే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఆకట్టుకునే విధంగా ఉండడం వల్లే.అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టీజర్ మరియు ట్రైలర్ తో పాటుగా పాటలు కూడా బాగుండాలి, అప్పుడే ఓపెనింగ్స్ వస్తాయి.
విరూపాక్ష లో పాటలు బాగాలేకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో అయితే జరగలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించిన ఆదరించకపోయినా క్వాలిటీ కంటెంట్ ఇస్తే ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రం మంచి వసూళ్లు ఇస్తారు.ఇది చాలా సందర్భాలలో రుజువు అయ్యింది, ఇప్పుడు విరూపాక్ష విషయం లో కూడా అదే జరిగింది.
అమెరికా లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 35 వేల డాలర్లు వచ్చాయట.ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు.ప్రీమియర్స్ పూర్తి అయ్యే సమయానికి కచ్చితంగా లక్ష డాలర్లు వసూలు చేస్తుందని, టాక్ వస్తే మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.

మరో విశేషం ఏమిటంటే రేపు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రం విడుదల అవుతుంది.ఆ చిత్రం కంటే కూడా అమెరికా లో ‘విరూపాక్ష’ కి మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.మొన్న కొంతమంది ప్రముఖులకు వేసిన ప్రైవేట్ స్క్రీనింగ్ లో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అదే రేంజ్ రెస్పాన్స్ రేపు కూడా పబ్లిక్ నుండి వస్తుందో లేదో చూడాలి.