Mahesh Babu – Rana Daggubati : మహేష్ బాబు కేవలం నమ్రత భర్త మాత్రమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన రానా దగ్గుపాటి

Mahesh Babu – Rana Daggubati : విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుపాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ఈనెల 10 వ తారీఖున స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యం లో దగ్గుపాటి రానా ప్రొమోషన్స్ లో బాగా పాల్గొంటున్నాడు.ముఖ్యంగా హిందీ ప్రొమోషన్స్ లో రానా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు.ఈ సందర్భంగా రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో టాలీవుడ్ హీరోల గురించి […]

Written By: NARESH, Updated On : March 4, 2023 8:59 pm
Follow us on

Mahesh Babu – Rana Daggubati : విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుపాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ఈనెల 10 వ తారీఖున స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యం లో దగ్గుపాటి రానా ప్రొమోషన్స్ లో బాగా పాల్గొంటున్నాడు.ముఖ్యంగా హిందీ ప్రొమోషన్స్ లో రానా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు.ఈ సందర్భంగా రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో టాలీవుడ్ హీరోల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడంటే మన టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో దుమ్ము లేపేస్తున్నాయి కానీ, ఆరోజుల్లో మన తెలుగు హీరోలెవ్వరో అక్కడి వాళ్లకు అసలు తెలిసేది కాదు,నాకు సంబంధించిన స్నేహితుడు ఒకడిని ముంబై లో కలిసినప్పుడు ప్రస్తుతం ఏమి సినిమాలు చేస్తున్నావ్ అని అడిగాడు, అప్పుడు నేను బాహుబలి సినిమా చేస్తున్నాను అని చెప్పాను’

‘అప్పుడు ఆయన ‘అవునా హీరో ఎవరు..నువ్వేనా?’ అని అడిగాడు, కాదు ప్రభాస్ అని చెప్పాను, ‘ప్రభాస్ ఎవరు ?’ అని అడిగితే అప్పుడు నేను అతను చేసిన సూపర్ హిట్ సినిమాలన్నీ చెప్పి ఇతనే ప్రభాస్ అని చెప్పాను.ఆరోజుల్లో అలా ఉండేది,అలాగే మన మహేష్ బాబు గురించి చెప్తే ‘చిన్న భర్త కదా, అతను నాకు బాగా తెలుసు కానీ అతని సినిమాలు నేనేమి చూడలేదు’ అని చెప్పాడు.అప్పుడు నేను అన్నాను , రాబొయ్యే 3 , 4 ఏళ్లలో మా టాలీవుడ్ హీరోలందరూ బాలీవుడ్ ని ఏలేస్తారు చూస్తూ ఉండు అని, ఈరోజు అది నిజమై మా టాలీవుడ్ సినిమాలు ఇక్కడ ఇరగదీస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది ‘ అని రానా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.క్రైమ్ /యాక్షన్ జానర్ లో తెరకెక్కిన ‘రానా నాయుడు’ సిరీస్ ని సూపెమ్ వర్మ మరియు కరణ్ అన్షుమ్యాన్ దర్శకత్వం వహించారు.