James Cameron- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన #RRR చిత్రం గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతతి ప్రభంజనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే..ప్రపంచావ్యాప్తమగా ఈ సినిమాకి 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి..బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో , డిజిటల్ మీడియా లో అంతకు మించి పది రెట్లు సంచలన విజయం సాధించింది.

ప్రపంచం లో ఉన్న అన్నీ దేశాల సినీ అభిమానులు ఈ సినిమాని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..బాహుబలి సిరీస్ కి #RRR కి వచ్చిన గుర్తింపులో పావు శాతం కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ప్రస్తుతం ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ వస్తున్నాయి..మొన్నీమధ్యనే ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ మరియు ‘లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్’ వచ్చాయి..ఈ ఈవెంట్స్ కి రాజమౌళి తో పాటుగా రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు కీరవాణి కూడా హాజరయ్యారు.
అయితే అక్కడకి అవతార్ సిరీస్ మరియు టైటానిక్ వంటి వెండితెర అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కెమరూన్ కూడా హాజరయ్యాడు..రాజమౌళి ని కలిసాడు..అక్కడ వాళ్లిద్దరూ మాట్లాడుకున్న సంభాషణకు సంబంధించిన వీడియో ని నేడు #RRR మూవీ టీం విడుదల చేసారు..ఇందులో రాజమౌళి జేమ్స్ కెమరూన్ గురించి మరియు జేమ్స్ కెమరూన్ రాజమౌళి గురించి చెప్పిన మాటలు వింటే అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి.

జేమ్స్ కెమరూన్ మాట్లాడుతూ ‘నేను మీ #RRR చూసాను..ఎంతో అద్భుతంగా అనిపించింది..హీరోలిద్దరికీ మీరు డిజైన్ చేసిన పాత్రలు అద్భుతం..ముఖ్యంగా రామ్ బ్యాక్ స్టోరీ నాకు ఎంతగానో నచ్చింది..ఎందుకు అతను అలా చేస్తున్నాడు..దానికి కారణం ఏమిటి..అతను పడుతున్న బాధ ఏమిటి ఇలాంటివన్నీ ఎంతో అద్భుతంగా చూపించారు..మీరు ఇండియా లోనే సినిమాలు తీసుకోండి..దయచేసి ఇక్కడకి రావొద్దు..మా కెరీర్స్ కూడా రిస్క్ లో పడుతాయి’ అంటూ జేమ్స్ కెమరూన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
"If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻
Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2
— RRR Movie (@RRRMovie) January 21, 2023