
Ram Charan Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఉన్నంత జోష్ లో ఏ టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. #RRR చిత్రం తో ఆస్కార్ గెలుచుకొని గ్లోబల్ వైడ్ తన పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోయ్యేలా చేసుకున్నాడు.అందుకే ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు వేడుకలను మిన్నంటే రేంజ్ లో చేసారు.

ఆయన కెరీర్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.ఈ ఉత్సాహం ని రెట్టింపు చేస్తూ నేడు ఆయన శంకర్ తో చేస్తున్న కొత్త చిత్రం టైటిల్ ని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు.’గేమ్ చేంజర్’ గా టైటిల్ ని ఖారారు చెయ్యగా, కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసాడు.
ఈ పోస్టర్ కి వచ్చిన రెస్పాన్స్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది.రామ్ చరణ్ ఈ ఫస్ట్ లుక్ ని అప్లోడ్ చేసిన నిమిషాల వ్యవధి లోనే వేలకొద్ది రీట్వీట్స్ మరియు లైక్స్ వచ్చాయి.ఎక్కడ చూసిన ‘గేమ్ చేంజర్’ కి సంబంధించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏ సర్క్యూలేట్ అవుతుంది.

ఈ పోస్టర్ చూస్తుంటే రామ్ చరణ్ మరో సారి పాన్ వరల్డ్ స్థాయిలో తన సత్తా చాటబోతున్నాడని, మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి చరిత్ర సృష్టించబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే రామ్ చరణ్ కి తమిళనాడు లో కూడా స్థిరమైన మార్కెట్ ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ శంకర్ కి రజినీకాంత్ తో సరిసమానమైన స్టార్ ఇమేజి ఉంది. అంతే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం అద్భుతాలు సృష్టించబోతుందని అంటున్నారు విశ్లేషకులు.