
Rajasthan Dowry: అమ్మాయిల పెళ్లికి కట్న కానుకలు ఇవ్వడం సహజం. ఈ మధ్యకాలంలో కట్న కానుకలు పెరగడంతో లక్షల్లో ఇస్తున్నారు. అయితే రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని దింగ్ సారకు చెందిన ఓ ఇద్దరు అన్నదమ్ములు తన చెల్లికి ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల కట్న కానుకలను సమర్పించారు. భారీగా కట్నం ఇచ్చిన ఆ అన్నదమ్ములకు చెల్లి అంటే ఎంత ప్రేమో అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.
పెళ్లి అంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం..
వివాహం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి అంటే ఖర్చు తడిసి మోపిడౌతుంది. మగ పెళ్లి వారి కోరే గొంతెమ్మ కోరుకోరు తీర్చడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులు పాలు అవుతుంటారు. కానీ మగాళ్లు ఏమాత్రం సిగ్గుపడకుండా తమను తాను బేరం పెట్టుకొని అమ్ముడు పోవడానికి రెడీ అవుతుంటారు. తరాల మారుతున్న ఈ ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లను ఒట్టి చేతులతో అత్తారింటికి పంపాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. తమకు చేతనైనంతలో బాగానే పెట్టాలనుకుంటారు. కానీ మగ పెళ్లి వారు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాము డిమాండ్ చేసినంత ఇస్తేనే పెళ్లి అంటారు.
తాహతకు తగ్గట్టు కట్న కానుక..
ఒకప్పటితో పోలిస్తే కట్న కానుకలు ఇప్పుడు భారీగా పెరిగాయి. తల్లిదండ్రులు కూడా అమ్మాయి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు. ఆస్తిపాస్తుల్లో అబ్బాయిలకు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అందుకు సమానంగానే.. అమ్మాయిలకు ఇచ్చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వివాహ సమయంలోనే దాహతకు తగ్గట్టుగా కట్న కానుకలు ముట్ట చెబుతున్నారు. తాజాగా సోదరి పెళ్లికి ఇద్దరు అన్నలు భారీ ఎత్తున కట్ట కానుకలు అందించి రికార్డు సృష్టించారు.
8 కోట్ల రూపాయలకుపైగా విలువచేసే కట్న కానుకలు..
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని ధింగ్ సార గ్రామానికి చెందిన అర్జున్ రామ్ మెహారియా, భగీరథ మెహారియాలు అనే ఇద్దరు అన్నదమ్ములు.. తమ చెల్లి పెళ్లి సందర్భంగా ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా విలువచేసే కట్న కానుకలు అందించారు. వివాహం సందర్భంగా రూ.2.21 కోట్ల నగదుతోపాటుగా 1.105 కేజీల బంగారం, 14 కేజీల వెండి పెట్టారు. ఇవే కాకుండా మరో రూ.4.42 కోట్లు విలువ చేసే భూమిని కానుకగా అందించారు. అంతేకాకుండా సోదరి కోసం ట్రాక్టర్ గోధుమలు, స్కూటీ తో పాటుగా మరికొన్ని వాహనాలు, నగలను కట్నంగా అందించారు. ఆ కట్నాన్ని అందించడానికి వందలాదిమంది వారితో పాటుగా వెళ్లారు. దీంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

కళ్యాణ మండపం వరకు బారులు..
సోదరికి కట్నం అందించేందుకు ఈ ఇద్దరు అన్నలు.. వందలాది కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లతో కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. ఇలా పెళ్లి వేడుకకు కట్న కానుకలు సమర్పించడానికి స్థానికంగా మైరా అంటారు. అయితే అర్జున్, భగీరథులు ఇచ్చిన మైదానే ఈ ప్రాంతంలో అతిపెద్దది మైరాగా రికార్డు సృష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆచారం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోందని, సోదరి పెళ్లికి ఇలా భారీ కట్నం అందించడం తమ కుటుంబ సాంప్రదాయమని ఈ సోదరులు వెల్లడించారు.
మైరా సాంప్రదాయం అంటే..?
నాగౌర్ లో ఎన్నో ఏళ్లగా ఈ మహిళా సంప్రదాయం అమల్లో ఉంది. హిందూ సాంప్రదాయ పెళ్లిలో ఇది ఒక భాగం. చెల్లెలకి ఆర్థిక భారం తగ్గించేందుకు ఆమె సోదరులు ఈ మైరాను అందిస్తారు. ఇందులో భాగంగా సోదరి పెళ్లి వేడుకను సోదరులే దగ్గరుండి జరిపిస్తారు. అయితే తమ గ్రామంలో సోదర వివాహానికి ఎవరు ఇవ్వనంత భారీ ఎత్తున కట్న కానుకలు సమర్పించి ఈ సోదరులు పెళ్లి జరిపించారు. ఈ పెళ్లికి ఏకంగా రూ. 8.1 కోట్ల విలువ చేసే నగదు, బహుమతులను పెళ్లికి కట్నంగా ఇచ్చారు. ఇది ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.