Homeఎంటర్టైన్మెంట్Game Changer Review: 'గేమ్ చేంజర్' మూవీ బెన్ ఫిట్ షో రివ్యూ...

Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ బెన్ ఫిట్ షో రివ్యూ…

Game Changer Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ విజయాలు సాధించే దిశ ముందుకు దూసుకెళ్తున్ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే జనం మంచి కోరుకునే ఐఏఎస్ ఆఫీసర్ (రామ్ చరణ్) జనం కోసం ఏదో ఒకటి చేయాలి జనాన్ని బాగా చూసుకోవాలి అంటూ అనుక్షణం పరితపిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలోనే జనం చచ్చి పోయిన పర్లేదు మనం బాగుండాలి జనాన్ని తొక్కుతూ పైకి ఎదగాలి అని భావించే ఒక మంత్రి వీళ్ళ మధ్య జరుగుతున్న పోటీలో ఎవరు ఎవరి మీద పై చేయి సాధించారు. అలాగే అప్పన్న ను వాడుకొని సిఎం గా ఎదిగిన మోపిదేవ్ మంచోడా, చెడ్డోడా ఆయన అసలు అప్పన్నను ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది…అప్పన్న కి ఐఏఎస్ ఆఫీసర్ కి, అలాగే మోపిదేవ్ కి మంత్రి కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లాంటి విషయాలు మీకు తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు శంకర్ చాలా వరకు బాగా తీసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ఈ సినిమాలో కథపరంగా ఓకే కనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమాలో కొన్ని బొక్కలైతే ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు ఓకే అనిపించినప్పటికీ కొన్ని లాజిక్స్ అయితే గాలికి వదిలేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నారనే చెప్పాలి…

ఇక ఫస్టాఫ్ మొత్తం రామ్ చరణ్ కైరా అద్వానీ మధ్య వచ్చే సీన్స్ తో ముందుకు సాగుతూ ఉంటుంది. నిజానికి ఇంటర్ వెల్ కి ఒక 20 నిమిషాల ముందు ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ప్రతి సీన్ ని శంకర్ చాలా వరకు ఎక్స్టెండ్ చేస్తూ చెప్పి ప్రయత్నం అయితే చేశాడు. ఇక సెకండాఫ్ లో అప్పన్న ఎపిసోడ్ తో ఫ్లాష్ బ్యాక్ ని స్టార్ట్ చేసిన శంకర్ ఆ ఎపిసోడ్ లో మాత్రం ప్రతి ఒక్కరిని ఎమోషనల్ గా కనెక్ట్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా ప్రతి సీఎం కూడా చాలా ఎక్స్ట్రాడినరిగా ఉంటుంది. సెకండాఫ్ మొత్తం ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రామ్ చరణ్ ఈ సినిమాలో కూడా తన విశ్వరూపం అయితే చూపించాడు.

ముఖ్యంగా సెకండాఫ్ సీన్స్ కి ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక సినిమా ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించినప్పటికి, సెకండాఫ్ మాత్రం చాలా బాగుందనే ఫీల్ అయితే కలుగుతుంది. రామ్ చరణ్ కైరా అద్వానీ మధ్య వచ్చే సీన్లు కొంతవరకు ప్రేక్షకులను బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన్న లవ్ స్టోరీ చాలా ఇబ్బందిగా ఉందనే చెప్పాలి. మరి అది ఎందుకు ఈ సినిమాలో వాడారు. దానివల్ల సినిమాకి పెద్దగా ఒరిగింది అయితే ఏమీ లేదు… ఇక రామ్ చరణ్ ఎస్ జే సూర్య ల మధ్య వచ్చిన టగ్ ఆఫ్ వార్ సీన్స్ సగటు ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇస్తాయి…

ఇక చాలా రోజుల తర్వాత శంకర్ మార్క్ టేకింగ్ అయితే ఈ సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రతిదీ డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేసినప్పటికి శంకర్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఫ్లాప్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాను చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని సూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ శంకర్ ఇద్దరు కలిసి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. ఇక అంజలి క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంది. ముఖ్యంగా మదర్ అండ్ సన్ రిలేషన్ షిప్ లో వచ్చిన ఎమోషన్ సీన్స్ ప్రేక్షకుడిని చాలా వరకు ఆకట్టుకుంటాయి. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్న తీసుకున్న నిర్ణయాలకు అంజలి ఇచ్చే సపోర్ట్ కూడా సినిమాలో చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటాయి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షో చేశారనే చెప్పాలి. ప్రతి సీన్ లో తనను తాను ఎలివేట్ చేసుకోవడమే కాకుండా సినిమాలో ఉన్న ఎమోషన్ ను మోస్తూ ముందుకు సాగాడు. ముఖ్యంగా శంకర్ ఈ సినిమాలో రామ్ చరణ్ మీద ఎలాంటి చాలా పెద్ద బాధ్యత పెట్టాడు. దాన్ని సక్సెస్ ఫుల్ గా నెరవేర్చే ప్రయత్నం అయితే చేశాడు… డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలు ఆయనకు చాలా సెటైల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించాడనే చెప్పాలి. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు.

శంకర్ రాసుకున్న పాత్రను ఎక్కడ తగ్గించకుండా రామ్ చరణ్ చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా ఆయన నటన ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది…ఇక అంజలి యాక్టింగ్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. కైరా అద్వానితో పోల్చుకుంటే అంజలి పాత్రకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. కాబట్టి ఆమె గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ పాత్రలో ఉన్న ఇంపార్టెన్స్ తెలిసే శంకర్ ఆమెను పిక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఎస్ జె సూర్య నిజమైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రతి సీన్ లో తన విలనిజాన్ని ఎలివేట్ చేయడానికి డిఫరెంట్ మాడ్యూలేషన్స్ వాడుతూ చాలా అద్భుతంగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన చాలా సెలెక్టెడ్ పాత్రలు ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. చేసిన ప్రతి పాత్ర కూడా అతనికి చాలా మంచి పేరు తీసుకురావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే మిగిలిన ఆర్టిస్టులు అయిన సునీల్, శ్రీకాంత్, వెన్నెల కిషోర్ లాంటి నటులు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ విషయంలో చాలావరకు కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా శంకర్ సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ తమన్ మాత్రం రెహమాన్ మ్యూజిక్ మరిపించేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడనే చెప్పాలి… ఇక సినిమాటోగ్రఫీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి విజువల్స్ ని అందించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా శంకర్ సినిమాలో సినిమాటోగ్రఫీకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ప్రతి సీను గాని, సాంగ్ గాని అద్భుతంగా చిత్రీకరించాలని శంకర్ అనుకుంటాడు. అందువల్లే ఆ మేకింగ్ లో అతనికి విజువల్ గా సినిమాటోగ్రాఫర్ చాలా వరకు సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది… ఇక దిల్ రాజు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…

ప్లస్ పాయింట్స్

కథ
రామ్ చరణ్
సెకండాఫ్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్..
హీరో హీరోయిన్ లవ్ ట్రాక్..
కొన్ని లాజిక్ లేని సీన్స్…

రేటింగ్

ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version