
Orange Re Release: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ నేడు #RRR సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకొని పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించి చిరంజీవి ని మరియు మెగా అభిమానులని ఎంతో గర్వపడేలా చేసాడు. ఇక నుండి రామ్ చరణ్ ఏ సినిమా చేసినా అది కేవలం తెలుగు సినిమా అవ్వద్దు, పాన్ వరల్డ్ సినిమా అవుతుంది.
డైరెక్టర్స్ కూడా ఇక నుండి రామ్ చరణ్ తో చేసే సినిమాని పాన్ వరల్డ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. ఇక ఈ నెల 27 వ తారీఖున రామ్ చరణ్ పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఏడాది ఆయన పుట్టిన రోజు ని అభిమానులు ఎంతో ఘనంగా,అంగరంగ వైభవం గా జరుపుతారు. ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫ్యాన్స్.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘మగధీర’ చిత్రాన్ని రీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఫ్యాన్స్.కానీ టెక్నికల్ సమస్యలు కారణం గా ఈ సినిమాని విడుదల చేయలేకపోతున్నారు. దీనితో నాగబాబు తాను నిర్మించిన ‘ఆరంజ్’ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన ఈ సినిమా ఆరోజుల్లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ నేటి తరం యూత్ నచ్చే సినిమా కావడం తో రీ రిలీజ్ చేస్తున్నారు.

అదే విధంగా జపాన్ లో కూడా రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ సినిమాని మార్చి 27 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. దీనితో పాటుగా మగధీర చిత్రాన్ని కూడా విడుదల చేస్తారట.ఎవరైనా సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసుకొని సంబరాలు చేసుకుంటారు. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం హీరో కెరీర్ లో డిజాస్టర్ గా నిల్చిన సినిమాలను రీ రిలీజ్ చేసుకొని సరికొత్త ట్రెండ్ కి తెరలేపారు.మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.