https://oktelugu.com/

Mohan Babu Birthday: మోహన్ బాబు పుట్టినరోజు నాడు కొత్త కోడలు మౌనిక ఏం చేసిందో తెలుసా?

Mohan Babu Birthday: సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో వరుస వేడుకలు చోటు చేసుకుంటున్నాయి. మార్చి 3న మనోజ్ వివాహం జరిగింది. 19వ తేదీన మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. మామయ్య బర్త్ డే వేడుకల్లో కొత్త కోడలు మౌనిక అన్నీ తానై వ్యవహరించినట్లు సమాచారం. మోహన్ బాబు బర్త్ డే ఫోటోలు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోల్లో మోహన్ బాబుతో పాటు కూతురు మంచు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 20, 2023 / 01:06 PM IST
    Follow us on

    Mohan Babu Birthday

    Mohan Babu Birthday: సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో వరుస వేడుకలు చోటు చేసుకుంటున్నాయి. మార్చి 3న మనోజ్ వివాహం జరిగింది. 19వ తేదీన మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. మామయ్య బర్త్ డే వేడుకల్లో కొత్త కోడలు మౌనిక అన్నీ తానై వ్యవహరించినట్లు సమాచారం. మోహన్ బాబు బర్త్ డే ఫోటోలు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోల్లో మోహన్ బాబుతో పాటు కూతురు మంచు లక్ష్మి, భార్య నిర్మలాదేవి, కొడుకు కోడలు మనోజ్, మౌనికలు కూడా ఉన్నారు.

    ఇంటి పెద్ద జన్మదినం వేళ అందరూ గుడికి వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక మామయ్య బర్త్ డే వేడుకల్లో మౌనిక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన జన్మదిన కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారట. మంచు లక్ష్మి, మౌనిక ఈ వేడుక మోహన్ బాబు మనసుకు నచ్చేలా నిర్వహించారట. మోహన్ బాబు మనసును మౌనిక గెలుచుకున్నారట. మొదట్లో మౌనికపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందట. ఈ మేరకు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

    Mohan Babu Birthday

    భూమా మౌనికతో మనోజ్ వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. ఈ పుకార్లను ధృవీకరించేలా మోహన్ బాబు మనోజ్ పెళ్లి కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. దీంతో తమ్ముడి పెళ్లి బాధ్యత మంచు లక్ష్మి తీసుకుంది. ఆమె నివాసంలోనే మనోజ్-మౌనికల వివాహం జరిగింది. ముహూర్తానికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు భార్యతో పాటు వేడుకకు హాజరయ్యారు. కొడుకు కోడలిని ఆశీర్వదించారు. మౌనిక ఇంట్లో అడుగుపెట్టాక వచ్చిన మొదటి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో ఆమె ప్రత్యేకత చాటుకున్నారు.

    అయితే వీరితో మంచు విష్ణు కనబడక పోవడం విశేషం. ఈ పెళ్లి విషయంలో మంచు విష్ణు సీరియస్ గా ఉన్నారని వినికిడి. అందుకే మనోజ్-మౌనిక పాల్గొన్న మోహన్ బాబు జన్మదిన కార్యక్రమానికి హాజరు కాలేదన్న వాదన వినిపిస్తోంది. అయితే తండ్రికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కాగా మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2019లో ఆమెతో విడాకులు అయ్యాయి. ఈ ఏడాది మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహం.

    Tags