Rajasthan High Court: భారతదేశంలో న్యాయస్థానాల తీర్పులు విచిత్రంగా వింతగా ఉంటాయి. మన చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకుని ఎంతో మంది శిక్ష నుంచి తప్పించుకుంటారు. వంద మంది హంతకులు తప్పించుకున్నఫర్వాలేదు. కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనేది న్యాయ సిద్ధాంతం. మన చట్టంలోని నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుని నిందితులు తప్పించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ లా లో ఉన్న కొన్ని మార్గాలను తమకు దగ్గర దారిగా మలుచుకుంటున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ను ఇంటి మంచం కోడ్లలా మార్చుకుంటున్న సంగతి విధితమే. దీంతో న్యాయవ్యవస్థ అపఖ్యాతి పాలవుతోంది.
తాజాగా రాజస్థాన్ లోని బోథ్ పూర్ లోని న్యాయస్థానం ఇటీవల ఓ కొత్తతరహా తీర్పు వెలువరించింది. జీవితఖైదు అనుభవించే వ్యక్తికి పదిహేను రోజుల పెరోల్ మంజూరు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది దీనిపై న్యాయస్థానం పెరోల్ మంజూరు చేయడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు భావోద్వేగ విషయాల్లో సున్నితమైన అంశంగా తీర్పు వెలువరించడం సంచలనం కలిగిస్తోంది. ఈమేరకు కోర్టు తీర్పు నిందితుడికి అనుకూలంగా రావడంతో పిటిషన్ దారుకు న్యాయం జరిగిందని చెబుతున్నారు.
Also Read: KGF 3: కేజీఎఫ్-3 పై డైరెక్టర్ ఆలోచన ఏంటీ?
రాజస్థాన్ లోని భిళ్వారా కోర్టు 2019లో నందలాల్ అనే నిందితుడికి జీవితఖైదు విధించింది. దీంతో తాను సంతానం పొందే అవకాశం కోల్పోయానని అతడి భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దీంతో విచారణ చేపట్టిన కోర్టు నిందితుడి భార్య లేవనెత్తిన ప్రశ్న సజావుగానే ఉందని భావించింది. ఆమె కోరిక మేరకు నిందితుడికి 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆమె తన భర్తతో సంసారం చేసి బిడ్డకు తల్లిని కావాలని భావిస్తోంది. దీనికి గాను న్యాయస్థానం కూడా అంగీకరించింది.
ఈమేరకు జస్టిస్ సందీప్ మెహతా, ఫర్జాంద్ అలీలతో కూడిన ధర్మాసనం నిందితుడి భార్య వాదనలో వాస్తవం ఉందని గ్రహించిన న్యాయస్థానం ఆమెకు బిడ్డను పొందే హక్కు ఉందని వాదించింది. దీంతోనిందితుడు నందలాల్ కు 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ తీర్పువెలువరించడంతో ఆమె తన భర్తతో సంసారం చేసే వెసులుబాటు కల్పించింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేసినా అదే నిజమని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి రాజస్థాన్ కోర్టు ఇచ్చిన తీర్పుతో అందరిలోహర్షం వ్యక్తం అవుతోంది.
Also Read:Sitara: ‘సితార’ కాబోయే స్టార్ హీరోయిన్.. మహేష్ కు ఎలాంటి భయాలు లేవు.. ఫ్యాన్స్ సీరియస్ !