Prashanth Neel: కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డుల మోత మోగిస్తోంది. ఏప్రిల్ 14న రిలీజైన కేజీఎఫ్ 2 అన్ని భాషల్లో సినిమా రికార్డులను బద్దలు కొట్టుకుంటూ పోతోంది. కన్నడ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే హిదీ వెర్షన్ లో బాహుబలి, ఆర్ఆర్ ఆర్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా కీలక పాత్రల్లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావురమేష్ నటించారు.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అందరిచూపు సౌత్ సినిమాలపైనే ఉంది. ఎక్కడా చూసినా అదే చర్చ కొనసాగుతుంద. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ కేజీఎఫ్, పుష్పా, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 ఇలా వరుసగా సంచలనం సృష్టిస్తున్నాయి. అమరేంద్ర బాహుబలి.. రాకీభాయ్ పేర్లు ప్రభంజనమే సృషించాయని చెప్పాలి. ఇకపై కూడా ఇదే ట్రెండ్ కొనసాగేలా ఉంది.
Also Read: KGF 3: కేజీఎఫ్-3 పై డైరెక్టర్ ఆలోచన ఏంటీ?
అయితే కేజీఎఫ్ మూవీకి సంబంధించి పలు విషయాలపై సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ పాత్రలు అవసరం కాబట్టే అక్కడ పుట్టుకొచ్చాయని చెప్పారు. ప్రకాష్ రాజ్ పాత్ర మూవీ లో ఇరికించినట్లు కాకుండా కథలో మరింత ఆసక్తిని పెంచడం కోసం ఆ పాత్రను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. రాఖీ బాయ్ నిజ జీవితంలో జరిగిన కథలు రాయడం కోసం ఈ తన కుటుంబాన్ని కూడా పట్టించుకోడని.. అది తెలియడం కోసమే కొడుకుగా ప్రకాష్ రాజ్ పాత్ర క్రియేట్ చేసినట్లు తెలుస్తుందని చెప్పారు. అలాగే అధిర పాత్రలో సంజయ్ దత్ జీవించారని అందుకే సినిమాలో కీలక పాత్ర అధిరా కోసం ఆయన్ను తీసుకున్నట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చారు. కాగా కేజీఎఫ్ చాప్టర్ 2 ని తెలుగులో సీనియర్ నటుడు కైకాల సమర్పించడం విశేషం.
Also Read:Sitara: ‘సితార’ కాబోయే స్టార్ హీరోయిన్.. మహేష్ కు ఎలాంటి భయాలు లేవు.. ఫ్యాన్స్ సీరియస్ !
Recommended Videos: