టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడిన పడిన సంగతి తెల్సిందే. కరోనా నుంచి రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాత్మిక, శివానీ త్వరగానే కోలుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ భార్య జీవిత కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా కరోనా నుంచి బయటపడింది. అయితే కరోనా నుంచి రాజశేఖర్ కోలుకోకపోవడంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
రాజశేఖర్ ఆరోగ్యంపై తాజాగా జీవితా రాజశేఖర్ తాజాగా స్పందించారు. రాజశేఖర్ ఇంతకముందు కంటే చాలా త్వరగా కోలుకుంటున్నారని తెలిపింది. కరోనా సోకిన తొలినాళ్లలో ఆయన వైద్యానికి స్పందించకపోవడంతో చాలా భయం వేసిందని తెలిపింది. అయితే వైద్యులు ప్రతిక్షణం దగ్గరుండి ఆయనకు వైద్యం అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపింది.
Also Read: హీరోయిన్ సుమలత ఎవరి కూతురు.? ఎవరిని చేసుకుందో తెలుసా?
ప్రస్తుతం తన భర్తకు ఆక్సిజన్ అవసరం లేకుండానే వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆయన త్వరగానే డిశ్చార్జ్ అవుతారనే నమ్మకం ఉందని జీవిత తెలిపింది. అభిమానుల ప్రార్థనలతోనే ఆయన కరోనాను జయిస్తున్నారని రాజశేఖర్ ఆరోగ్యం పరిస్థితులను వివరించింది. దీంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వైరల్ అవుతున్న ప్రభాస్ మరో ఫోటో !
ఇటీవల రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్వీటర్లో తన తండ్రి ఆరోగ్యం నుంచి కోలుకోవాలని ప్రతీఒక్కరూ ప్రార్థించండి అంటూ ట్వీట్ చేయడంతో టాలీవుడ్లో టెన్షన్ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి సైతం శివాత్మిక ట్వీట్ కు స్పందించి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆయనతోపాటు పలువురు సెలబ్రెటీలు వారికి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈనేపథ్యంలోనే రాజశేఖర్ ఆరోగ్యం కుదుటపడటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Rajasekhar is in good health jeevitha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com