Chiranjeevi- Rajamouli: చిరంజీవి చేసిన పనికి డిస్సపాయింట్ అయిన రాజమౌళి చరణ్ తో అలా చేయించారా!

Chiranjeevi- Rajamouli: రాజమౌళి ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు. ప్రతి సన్నివేశం తెరకెక్కించే ముందు ఆయన థియేటర్లో ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఎలాంటి అనుభూతికి గురవుతారని ఆలోచిస్తాడట. ఒక ప్రేక్షకుడు ఆలోచనా కోణం నుండే సినిమా చిత్రీకరిస్తారట. సన్నివేశం ఏదైనా కానీ ఎమోషన్ అనేది ప్రధానం అంటారు. కోపం, ప్రేమ, ఆవేదన, బాధ, అభిమానం, ఆక్రోశం… ఏదో ఒక బలమైన ఫీలింగ్ సన్నివేశానికి ముడిపడి ఉండాలి. ఎమోషనల్ లేని సన్నివేశం ఎంత రిచ్ గా […]

Written By: Shiva, Updated On : March 4, 2023 8:58 am
Follow us on

Chiranjeevi- Rajamouli

Chiranjeevi- Rajamouli: రాజమౌళి ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు. ప్రతి సన్నివేశం తెరకెక్కించే ముందు ఆయన థియేటర్లో ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఎలాంటి అనుభూతికి గురవుతారని ఆలోచిస్తాడట. ఒక ప్రేక్షకుడు ఆలోచనా కోణం నుండే సినిమా చిత్రీకరిస్తారట. సన్నివేశం ఏదైనా కానీ ఎమోషన్ అనేది ప్రధానం అంటారు. కోపం, ప్రేమ, ఆవేదన, బాధ, అభిమానం, ఆక్రోశం… ఏదో ఒక బలమైన ఫీలింగ్ సన్నివేశానికి ముడిపడి ఉండాలి. ఎమోషనల్ లేని సన్నివేశం ఎంత రిచ్ గా తెరకెక్కించినా అది శవానికి అలంకరణ లాంటిదే అని ఆయన అభిప్రాయం.

ఈ క్రమంలో మగధీర సినిమాలోని ఓ సీన్ గురించి ఆయన వివరించారు. హీరో విలన్ కి గుర్రపు స్వారీ పందెం ఉంటుంది. హీరో రామ్ చరణ్ పొరపాటున ఇసుక ఊబిలో చిక్కుకుంటాడు. అప్పుడు తన గుర్రం అతన్ని కాపాడుతుంది. ఈ సీన్ కి చిరంజీవి నటించిన కొదమ సింహం మూవీలో సీన్ స్ఫూర్తి అట. కొదమ సింహం చిత్రంలో చిరంజీవిని రౌడీలు పీకల్లోతు వరకూ పూడ్చిపోతారు. అప్పుడు చిరంజీవి నోటితో విజిల్ వేసి తన గుర్రాన్ని పిలిచి… దాని సహాయంతో బయటపడతాడు.

అయితే తనను కాపాడిన ఆ గుర్రంతో చిరంజీవికి ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం రాజమౌళిని నిరాశపరిచిందట. అందుకే మగధీర మూవీలో రామ్ చరణ్ కి ఇసుక ఊబి సన్నివేశం పెట్టి, ఆ సమస్య నుండి గుర్రం కాపాడేలా చూపించాడు. తన మనసులో ఉన్న ఎమోషనల్ బాండింగ్ చరణ్ తో చేసి చూపించాడు. తనను కాపాడిన గుర్రాన్ని రామ్ చరణ్ హత్తుకుని కృతజ్ఞతలు చెబుతాడు. మన లక్ష్యం గెలుపు అని తన గుర్రాన్ని కూడా మోటివేట్ చేస్తాడు.

Chiranjeevi- Rajamouli

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చారు. 2009లో విడుదలైన మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రామ్ చరణ్ తన రెండో సినిమాతోనే అతిపెద్ద స్టార్ గా అవతరించారు. నిర్మాతలకు మగధీర కాసుల వర్షం కురిపించింది. మగధీర విడుదలైన 13 ఏళ్లకు వీరి కాంబోలో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. రామ్ చరణ్ పాత్రను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ రామ్ చరణ్ ఇమేజ్ మార్చేసింది. ఇప్పుడు ఆయన ప్రపంచానికి తెలిసిన నటుడు. ఊహించని స్థాయికి రామ్ చరణ్ ఎదిగారు.

Tags