Rudrudu Movie Review: నటీనటులు :
రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్, శరత్ కుమార్
డైరెక్టర్ : కత్తిరేషన్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు : ఠాగూర్ మధు
రాఘవ లారెన్స్ సినిమా అంటే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోయి ఉంటుంది అనే విషయం తెలిసిందే.కాంచన సిరీస్ తో హీరో గా దర్శకుడిగా లారెన్స్ ఎంత గొప్పగా రాణించాడో మన అందరికీ తెలిసిందే.ఈ సిరీస్ అటు తమిళం లోను ఇటు తెలుగు లోను సూపర్ హిట్స్ అయ్యాయి.అప్పటి నుండి లారెన్స్ సినిమాలకు తెలుగు లో మంచి గిరాకీ ఉండడం ప్రారంభం అయ్యింది.ఆయన కూడా తనకి ఉన్న మార్కెట్ కి తగ్గట్టుగానే మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ఉంటాడు.అందుకే ఆయనకీ కనీస స్థాయి ఓపెనింగ్ అయినా వస్తూ ఉంటుంది.రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘రుద్రుడు’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎలా ఉంది..? లారెన్స్ ప్రేక్షకులను అలరించాడా..?, మరోసారి హిట్టు కొట్టాడా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
రుద్ర(లారెన్స్) అనే యువకుడు ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేసుకునే సాధారణమైన వ్యక్తి.అతనికి తన తల్లితండ్రులంటే ప్రాణం, వాళ్ళకోసం ఏమైనా చేస్తాడు.అలా సాగిపోతున్న అతని జీవితం లోకి అనన్య (ప్రియా భావాన్ని శంకర్) అనే అమ్మాయి వస్తుంది.ఈమెని చూడగానే రుద్ర మనసు పారేసుకుంటాడు, ఆ తర్వాత ఆమెని వివాహం చేసుకొని,ఉద్యోగం కోసం విదేశాలకు పయనం అవుతాడు.ఇంతలోపే రుద్ర తల్లి (పూర్ణిమ భాగ్యరాజ్) చనిపోతుంది.రుద్ర విదేశాల నుండి తిరిగిరాగానే అనన్య కూడా చనిపోతుంది.ఆ తర్వాత కొద్దీ రోజులకు తన తల్లి మరియు భార్య సహజంగా చనిపోలేదని.విశాఖపట్నం లో బాగా పేరు మోసిన రౌడీ షీటర్ భూమి (శరత్ కుమార్) చేత చంపబడ్డాడని తెలుసుకుంటాడు.అసలు రుద్ర కుటుంబం తో భూమి ఉన్న సమస్యలు ఏమిటి..?, ఎందుకు వాళ్ళని చంపాడు..?, రుద్ర భూమి పై చివరికి ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే స్టోరీ.
విశ్లేషణ :
కథ విషయం లో కొత్తదనం ఏమి లేదు, మన చిన్నప్పటి నుండి చూస్తున్న రొటీన్ కమర్షియల్ సినిమానే,కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే రుద్ర ఫ్లాష్ బ్యాక్ సినిమాకి ఆయువుపట్టులాగ నిల్చింది.కథ మొత్తం మనకి ముందే అర్థం అయిపోతుంది, తర్వాత ఏమి జరగబోతుంది అనే సంగతి కూడా తెలిసిపోతుంది.కానీ సినిమాని చివరి వరకు ఆసక్తికరంగా చూస్తాము, అదే ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్.పోరాట సన్నివేశాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.అఖండ చిత్రం లో మనం ఎలాంటి ఊర మాస్ ఫైట్ సన్నివేశాలను చూసామో, అంతకు మించిన మాస్ సన్నివేశాలను ఈ సినిమాలో చూడవచ్చు.ముఖ్యంగా చివరి 30 నిముషాలు ఆడియన్స్ చేత ఈలలు కొట్టించేలా చేసింది.మొత్తానికి ఒక ఊర మాస్ సినిమాని అందించాడు డైరెక్టర్ కత్తిరేషన్.కామెరికాల్ గా కూడా ఈ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత ఈలలు వేయించుకోవడం ఆయనకీ కొట్టిన పిండి లాంటిది.ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన శరత్ కుమార్ పాత్ర పవర్ ఫుల్ గానే ఉన్నప్పటికీ , లారెన్స్ మాస్ ముందు తేలిపోయాడు.ఇక హీరోయిన్ గా నటించిన ప్రియా భవాని శంకర్ పాత్ర నిడివి తెరపైన కనిపించేది తక్కువే అయినా, ఉన్నంతలో చక్కగా నటించింది.ఇక లారెన్స్ కి తల్లితండ్రులుగా నాజర్ మరియు పూర్ణిమ భాగ్యరాజ్ తమ ఎమోషనల్ నటనతో సీన్స్ ని రక్తి కట్టించేందుకు ప్రయత్నం చేసారు.ఇక జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి అందించిన పాటలకంటే,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు రీ రికార్డింగ్ బాగుంది.
చివరి మాట : మాస్ కమర్షియల్ సినిమాలను నచ్చే వారికి ఈ చిత్రం ఈ వీకెండ్ కి మంచి ఛాయస్,థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి .
రేటింగ్ : 2.5 /5