https://oktelugu.com/

KGF 3: కేజీఎఫ్_3 వచ్చేస్తోంది: హింట్ ఇచ్చిన హోంబళే

KGF 3: ఏడాది క్రితం వచ్చిన “కేజీఎఫ్_2″ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. కన్నడ సినిమా అయినప్పటికీ ఇండియా వైడ్ గా కలెక్షన్ల దుమ్ము దులిపింది. ఒకానొక దశలో ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు.. కానీ 2022 లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ మూవీగా కేజీఎఫ్_2 నిలిచింది. ఈ చిత్ర హీరో యష్ ఒక్కసారిగా పాన్ స్టార్ అయిపోయాడు.. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ […]

Written By:
  • Rocky
  • , Updated On : April 14, 2023 / 05:10 PM IST
    Follow us on

    KGF 3

    KGF 3: ఏడాది క్రితం వచ్చిన “కేజీఎఫ్_2″ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. కన్నడ సినిమా అయినప్పటికీ ఇండియా వైడ్ గా కలెక్షన్ల దుమ్ము దులిపింది. ఒకానొక దశలో ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు.. కానీ 2022 లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ మూవీగా కేజీఎఫ్_2 నిలిచింది. ఈ చిత్ర హీరో యష్ ఒక్కసారిగా పాన్ స్టార్ అయిపోయాడు.. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ కమర్షియల్ సినిమా అంటే ఇలానే ఉండాలి అనే రేంజ్ లో బెంచ్ మార్క్ సృష్టించాడు. తనకు మాత్రమే తెలిసిన టేకింగ్ తో ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఈ చిత్రం విడుదల ఏడాదవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబాళే ఒక వీడియో విడుదల చేసింది.

    కేజీఎఫ్_2 లో కొన్ని కీలక సన్నివేశాలతో ప్రారంభమయ్యే ఈ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.. రాఖీ పాత్రను మరింత శక్తివంతంగా ప్రదర్శించింది.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డైలాగులు రావడంతో నిర్మాణ సంస్థ ఏదో చెప్పబోతోందనేది ప్రేక్షకులకు అర్థమైంది. వారి అంచనాలను నిజం చేస్తూ కేజిఎఫ్_3 సినిమా ఉంటుందని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతే కాదు ప్రేక్షకుల క్యూరియాసిటీకి ఊతం ఇచ్చేలా” రాఖీ భాయ్ 1979 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నను సంధిస్తూ ఆసక్తి కలిగించింది.

    కేజీఎఫ్_2 ఎండింగ్ లో రాఖీ భాయ్ అనేక నేరాలు చేశాడని అమెరికన్ సీఐఏ అధికారి ప్రధానమంత్రి రమికా సేన్ కు చెబుతాడు. అంటే ఈ రెండు సంవత్సరాలలో రాఖీ భాయ్ అనేక నేరాలు చేశాడని, అతడు నారాచికి మాత్రమే పరిమితం కాలేదని చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసిన వీడియో బట్టి అర్థమవుతోంది.. అంటే రాఖీ లక్ష్యం అంతకుమించి ఉందా? పార్ట్1,2 లో ప్రశాంత్ రాఖీ లో ఒక కోణం మాత్రమే చూపించాడా? అసలు విశ్వరూపం పార్ట్ _3 లో ఉంటుందా? అంటే ఔననే సమాధానం వస్తున్నది. పార్ట్_2 లో చాలా ప్రశ్నలను ప్రశాంత్ వదిలేశాడు. ఇండో పసిఫిక్ సముద్రంలోకి రాఖీ ఎందుకు వెళ్ళాడు? ఇండియన్ నేవి అధికారులతో పాటు ఇతర దేశాల అధికారులకు సమాచారం ఎందుకు ఇచ్చాడు? రాఖీ సముద్రంలో మునిగిపోయిన అనంతరం సీఐఏ అధికారి ఎందుకు వచ్చాడు? రమీకా సేన్ ను కలిసేందుకు రాఖీ వెళ్ళినప్పుడు అక్కడికి అమెరికన్ కంపెనీ సీఈవో ఎందుకు వచ్చాడు? ఆ అమెరికన్ అధికారితో తనను తాను సీఈవోగా రాఖీ ఎందుకు పరిచయం చేసుకున్నాడు? ఇన్ని ప్రశ్నలను మూడో భాగం లో ప్రశాంత్ రివిల్ చేస్తాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.

    KGF 3

    ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాను కూడా హొంబాళే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. దీనికిగాను భారీగా ఖర్చు చేస్తోంది. అయితే ఈ సినిమా ఎండింగ్ ను కేజీఎఫ్_3 కు ప్రశాంత్ లింక్ పెట్టాడని టాక్ నడుస్తోంది. మరోవైపు యష్ కేజీఎఫ్_2 తర్వాత ఇంతవరకు ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. పైగా ఆ లుక్ అలానే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక సలార్ పూర్తవగానే ప్రశాంత్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు. ఆ తర్వాతే కేజిఎఫ్_3 మొదలుపెడతాడని టాక్ నడుస్తోంది. కేజీఎఫ్_2 విడుదలైన ఏడాది తర్వాత మూడోపార్టుకు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పడంతో యష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరో వైపు ఈ చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

    Tags