Currency In Mobile: చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతిలో ఎంతో కొంత డబ్బులు చేత పట్టుకుంటారు. మొగవారు అయితే పర్సులు, ఆడవారు లేడీ హ్యాండ్ బ్యాగులో వేసుకుంటారు. కొంతమందికి ఇలా పర్సులు వాడడం ఇష్టముండదు. దీంతో చేతిలోనే డబ్బులు పట్టుకుంటారు. అయితే మొబైల్స్ వచ్చాక మొబైల్ లోని కవర్లో డబ్బలు పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టడం వల్ల సేఫ్ గాఉంటాయని భావిస్తున్నారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేసినా అది వికృతమే అవుతుందని గ్రహించాలి. ఇలా ఫోన్ కవర్లో డబ్బులు పెట్టడం వల్ల ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేంటో చూద్దాం..
ప్రతీ అవసరానికి మొబైల్ తప్పనిసరి. చేతిలో మొబైల్ లేకుండా ఎక్కడికి వెళ్లలేం. మొబైల్ ఎప్పుడు మనతోనే ఉంటుంది గనుక ఇందులో డబ్బులు ఉంచడం వల్ల మరిచిపోకుండా ఉంటామని అనుకుంటారు. చార్జింగ్ పెట్టేటప్పుడు ఎక్కువగా ఫోన్ యూజ్ చేసినప్పుడు ఫోన్ వేడి అవుతుండడాన్ని గ్రహించవచ్చు. ఇలా ఒక్కోసారి బాగా హీటెక్కి పేలిపోయే అవకాశం ఉంది. ఇలా పేలడం వల్ల డబ్బలు పోతాయి. అయితే ఫోన్ పేలడానికి కూడా ఇవే కారణమని తెలుస్తోంది. అదెలాగంటే..
ఫోన్ కవర్లో డబ్బలు పెడుతూ ఉంటారు. డబ్బులు కొన్ని కెమికల్స్ ఆధారంగా తయారవుతాయి. మొబైల్ వేడి అయినప్పుడు అది బయటకు వెళ్లడం వల్ల బయటిగాలిని తీసుకొని కూల్ అవుతుంది.అయితే ఫోన్ కవర్లో డబ్బులు పెట్టడం వల్ల అందులో నుంచి వచ్చే వేడిని డబ్బుల్లో ఉండే రసాయనాలు బయటకు వెళ్లనీయకుండా ఆపుతాయి. దీంతో ఆ వేడి అలాగే ఉండి.. ఆ తరువాత మరింత ఎక్కువై పేలిపోయే అవకాశం ఉంది. ఇలా చాలాచోట్ల సంఘటనలు జరిగాయి.
ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే. ఈరోజుల్లో చాలా మంది డిజిటల్ పేమేంట్స్ చేస్తున్నారు. ఇలా వీలు కాకపోతే వీటినిప్రత్యేకంగా పర్సులో లేదా ప్యాంట్ ప్యాకెట్ లో భద్రపరుచుకోవాలి. ఇలా ఫోన్ కవర్లో పెట్టడం వల్ల ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికైనా ఫోన్ లో డబ్బులు పెట్టేవారైతే అలా చేయకుండా ఉండండి.. మిగతా వారు అలా ఫోన్ లో డబ్బులు ఉంచినా.. వారికి ఇలాంటి సలహాలు ఇచ్చి..అటు మొబైల్స్.. ఇటు డబ్బులను కాపాడుకునే ప్రయత్నం చేయండి..