Pushpa Samantha Item song: పుష్పలో సమంత ఐటెమ్ సాంగ్ పాడింది ఎవరో తెలుసా?

Pushpa Samantha Item song: ‘పుష్ప’ మూవీ నుంచి సమంత నర్తించిన ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే పాట విడుదలై షేక్ చేస్తోంది. మాస్ మాసాలా సాంగ్ లా రూపొందిన ఈ పాట కుర్రకారును గిలిగింతలు పెడుతోంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా సూపర్ గా ఉందంటూ దేవీ శ్రీప్రసాద్ కు ప్రశంసలు కురుస్తున్నాయి. దేవీ శ్రీ కంపోజ్ చేసిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. […]

Written By: NARESH, Updated On : December 14, 2021 3:24 pm
Follow us on

Pushpa Samantha Item song: ‘పుష్ప’ మూవీ నుంచి సమంత నర్తించిన ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే పాట విడుదలై షేక్ చేస్తోంది. మాస్ మాసాలా సాంగ్ లా రూపొందిన ఈ పాట కుర్రకారును గిలిగింతలు పెడుతోంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా సూపర్ గా ఉందంటూ దేవీ శ్రీప్రసాద్ కు ప్రశంసలు కురుస్తున్నాయి.

idravathi chouhan

దేవీ శ్రీ కంపోజ్ చేసిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. అయితే ఆ పాట మూడ్, థీమ్ కు తగ్గట్టుగా పాట పాడిన సింగర్ గురించి ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు. అద్భుతంగా పాడిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పాటను పాడింది ఎవరో అని తెగ చర్చిస్తున్నారు.

ఈ ఊరమాస్ సాంగ్ ను చంద్రబోస్ రాయగా.. ‘ఇంద్రవతి చౌహాన్’ పాడారు. ఇంద్రవతి అంటే ఎవరో హిందీ నుంచి వచ్చిన సింగర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆమె ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ ‘మంగ్లీ’ చెల్లెలు. తొలి పాటతోనే అద్భుతంగా పాడి ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘ఊ అంటావా మావా’ అన్న పాటే వినిపిస్తుందంటే ఇంద్రవతి ఏ రేంజ్ లో పాడిందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ జానపద సింగర్ మంగ్లీ. ఆమె చెల్లెలే ఇంద్రవతి. మంగ్లీ లాగే జానపాద పాటలు పాడి మంచి పేరు సంపాదించింది ఇంద్రవతి. పుష్ప కంటే ముందు జార్జిరెడ్డి మూవీలో ‘జాజిమొగులాలి’ అనే పాట పాడింది. కానీ ఆ పాట సినిమాలో లేకుండా పోయింది.

దేవీశ్రీ ప్రసాద్ ఈసారి కాస్త హాట్ గా ఈ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అందుకు తగ్గట్టుగానే సింగర్ ఇంద్రవతి తనదైన లో వాయిస్ లో క్రిస్పీగా అదరగొట్టారు.

Also Read: సామ్​తో ‘పుష్ప’ ఐటెం సాంగ్​ షూటింగ్​ అప్పుడేనా?

పుష్ప మూవీ డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తయ్యింది. 12న ప్రీరిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు. షూటింగ్ పూర్తికావడంతో సినిమాకు పనిచేసిన 12 మంది ముఖ్య సభ్యులకు అల్లు అర్జున్ 10 గ్రాముల చొప్పున బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం.

indravathi-chauhan-2

ఊ అంటావా సాంగ్ ఇదే..

 

Also Read: ప్రమోషన్స్​ కోసం రంగంలోకి దిగుతున్న ‘పుష్ప’రాజ్​