https://oktelugu.com/

Pushparaj: ‘పుష్పరాజ్‌’గా మారిన జడేజా.. ఈసారి ఏకంగా..!

Pushparaj: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ వరల్డ్ వైడ్ గా కలెక్షన్లలో దూసుకెళుతోంది. ఈ మూవీలో ‘తగ్గెదేలే’ అన్నట్లుగా అల్లు అర్జున్ ఊరమాస్ లుక్కులో కన్పించి ఆకట్టున్నాడు. తనలోని నటవిశ్వరూపానికి బయటికి తీసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ‘పుష్ప’ మూవీకి దక్షిణాదితోపాటు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈక్రమంలోనే నార్త్ ఆడియన్స్ ఈ మూవీలోని సీన్స్, డైలాగ్స్ ను రీల్స్, డబ్ స్మాష్, రీ క్రియేట్ వంటివి చేస్తూ అభిమానులను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 13, 2022 / 11:34 AM IST
    Follow us on

    Pushparaj: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ వరల్డ్ వైడ్ గా కలెక్షన్లలో దూసుకెళుతోంది. ఈ మూవీలో ‘తగ్గెదేలే’ అన్నట్లుగా అల్లు అర్జున్ ఊరమాస్ లుక్కులో కన్పించి ఆకట్టున్నాడు. తనలోని నటవిశ్వరూపానికి బయటికి తీసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ‘పుష్ప’ మూవీకి దక్షిణాదితోపాటు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

    ఈక్రమంలోనే నార్త్ ఆడియన్స్ ఈ మూవీలోని సీన్స్, డైలాగ్స్ ను రీల్స్, డబ్ స్మాష్, రీ క్రియేట్ వంటివి చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పలువురు క్రికెటర్లు సైతం ‘పుష్ప’లోని కొన్ని సీన్స్ ఇమిమేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయగా అవికాస్తా వైరల్ గా మారాయి. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘పుష్ప రాజ్’ కన్పించి ఆకట్టుకున్నాడు.

    ఈ వీడియోపై విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో సెటైర్ వేసి నవ్వులు పూయించాడు. ఐపీఎల్ 14 సీజన్ ప్రారంభంలోనే ‘పుష్ఫ’ హవా మొదలైంది. కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ గతంలో ‘పుష్ప’ పోస్టర్ వాడుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ను ఆ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ ఓడించి తగ్గెదేలే అని నిరూపించింది. కోహ్లీ పోస్టర్ కు బన్నీ సైతం స్మైల్ ఈమెజీనీ షేర్ చేశాడు.

    తాజాగా మరో ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ జడేలా ‘పుష్ప రాజ్’ గా మారి అభిమానులను ఫిదా చేశాడు. ఊర మాస్ లుక్కుతో నోట్లో బీడీ పెట్టుకున్న ఫొటోను ఏకంగా తన ఇన్ స్ట్రాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోకు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైరు’ అనే డైలాగును వాడాడు. అలాగే బీడీ, పొగాకు ఆరోగ్యానికి హనికరం, క్యాన్సర్ వస్తుందని హెచ్చరించాడు. వీటికి ఫ్యాన్స్ దూరంగా ఉండాలని సూచించాడు. జడేజా ‘పుష్ప రాజ్’ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.