Pushpa: ‘పుష్ప’ను వెంటాడిన ‘సాహో’ సెంటిమెంట్… ఇది గమనించారా?

Pushpa: అల్లు అర్జున్ తాను ఆశించిన ఇమేజ్ కి దగ్గరయ్యాడు. ఆయన నార్త్ ఆడియన్స్ కి నచ్చేశాడు. ఎవరూ ఊహించని రేంజ్ లో పుష్ప హిందీ వసూళ్లు ఉన్నాయి. మూడు వారాల పాటు పుష్ప రన్ కొనసాగింది. మొత్తంగా పుష్ప హిందీ వర్షన్ రూ. 81 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.కేవలం మూడు కోట్ల రూపాయల ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టిన పుష్ప ఇంత గ్రాస్ వసూలు చేయడం నిజంగా మిరాకిల్. పుష్ప చిత్ర వసూళ్లు స్థిరంగా […]

Written By: Shiva, Updated On : January 13, 2022 11:16 am

Allu Arjun OTT Movie

Follow us on

Pushpa: అల్లు అర్జున్ తాను ఆశించిన ఇమేజ్ కి దగ్గరయ్యాడు. ఆయన నార్త్ ఆడియన్స్ కి నచ్చేశాడు. ఎవరూ ఊహించని రేంజ్ లో పుష్ప హిందీ వసూళ్లు ఉన్నాయి. మూడు వారాల పాటు పుష్ప రన్ కొనసాగింది. మొత్తంగా పుష్ప హిందీ వర్షన్ రూ. 81 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.కేవలం మూడు కోట్ల రూపాయల ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టిన పుష్ప ఇంత గ్రాస్ వసూలు చేయడం నిజంగా మిరాకిల్. పుష్ప చిత్ర వసూళ్లు స్థిరంగా కొనసాగడంతో ఇది సాధ్యమైంది.

Pushpa

ఇక ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అనడంలో సందేహం లేదు. కాగా ప్రభాస్ సాహో, అల్లు అర్జున్ పుష్ప చిత్రాల మధ్య రిజల్ట్ విషయంలో ఓ పోలిక ఉంది. ఈ రెండు చిత్రాలు ఇంట ఓడి రచ్చ గెలిచాయి. సాధారణంగా ఇతర భాషల్లో మన హీరోల సినిమాలు అటూ ఇటూ అయినా… తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. దానికి విరుద్ధంగా సొంత భాషలో చతికిలబడి, ఇతర భాషలో సాహో, పుష్ప సత్తా చాటాయి.

Also Read:  ‘పూజా హెగ్డే’ స్పెషల్ వీడియో.. నిషా అగర్వాల్‌ వర్కౌట్లు !

తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు మిగిల్చిన ఈ రెండు చిత్రాలు హిందీలో అదరగొట్టాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో సాహో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు వచ్చిన హైప్ ఈ మధ్య కాలంలో మరో సినిమాకు రాలేదు. దేశం మొత్తం సాహో కోసం ఎదురు చూశారు. అనూహ్యంగా సాహో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ క్రిటిక్స్ సాహో చిత్రానికి దారుణమైన రేటింగ్ ఇచ్చారు.

రేటింగ్ తో సంబంధం లేకుండా సాహో మూవీకి నార్త్ ఆడియన్స్ పట్టం కట్టారు. ఊహించని విధంగా సాహో హిందీ వర్షన్ రూ. 150 కోట్లు గ్రాస్ రాబట్టింది. తెలుగుతో పాటు మిగతా సౌత్ లాంగ్వేజెస్ లో సాహో నష్టాలు మిగిల్చింది. అల్లు అర్జున్ పుష్ప విషయంలో ఇదే జరగడం యాదృచ్ఛికం. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన పుష్ప తెలుగులో నష్టాలు మిగిల్చింది. మిక్స్డ్ రివ్యూ సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో సత్తా చాటలేకపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్స్ ధరలు తగ్గింపు కారణంగా నష్టాలు వచ్చాయని చెబుతున్నప్పటికీ… రేట్లు పెంచిన తెలంగాణా రాష్ట్రంలో కూడా పుష్ప వసూళ్లు అంత భారీగా ఏమీ లేవు. పుష్ప కేవలం బ్రేక్ ఈవెన్ దాటి… నైజాం బయ్యర్లను నష్టాల నుండి బయటపడేసింది. ఏపీలో మాత్రం యాభై శాతం మేర నష్టాలు మిగిల్చింది. కానీ పుష్ప హిందీ వర్షన్ అక్కడ సత్తా చాటింది. ఆ విధంగా సాహో, పుష్ప చిత్రాలు ఇంట ఓడి రచ్చ గెలిచాయి.

Also Read: థర్డ్ వేవ్ ఎఫెక్ట్: సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం

Tags