https://oktelugu.com/

Ram Charan: ఎన్టీఆర్, ప్రభాస్‌ సపోర్ట్‌ చేసినంత మాత్రాన నీకు గొప్ప స్థాయి రాదు

Ram Charan: సంక్రాంతికి బంగార్రాజు తర్వాత మరో పెద్ద సినిమా ‘రౌడీబాయ్స్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో పక్కా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రౌడీ బాయ్స్‌ మ్యూజికల్‌ ఈవెంట్‌’లో రామ్‌చరణ్‌ ముఖ్య అతిధిగా వచ్చాడు. Also Read: ‘పుష్ప’ను వెంటాడిన ‘సాహో’ సెంటిమెంట్… ఇది గమనించారా? ఈ సందర్భంగా చరణ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 13, 2022 / 11:36 AM IST
    Follow us on

    Ram Charan: సంక్రాంతికి బంగార్రాజు తర్వాత మరో పెద్ద సినిమా ‘రౌడీబాయ్స్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో పక్కా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రౌడీ బాయ్స్‌ మ్యూజికల్‌ ఈవెంట్‌’లో రామ్‌చరణ్‌ ముఖ్య అతిధిగా వచ్చాడు.

    Ram Charan

    Also Read: ‘పుష్ప’ను వెంటాడిన ‘సాహో’ సెంటిమెంట్… ఇది గమనించారా?

    ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ..‘ఈ ఇండస్ట్రీలోనే కాదు.. ఏ రంగంలో అయినా ప్రతిభ ఒక్కటే కాదు.. క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. ఆశిష్.. నీకు రాజు, లక్ష్మణ్‌గార్లు ఉండటం వల్లనో, లేక.. నేను, ఎన్టీఆర్, ప్రభాస్‌ సపోర్ట్‌ చేయడం వల్లనో నీకు గొప్ప స్థాయి రాదు అని గుర్తు పెట్టుకో. నీ కష్టమే నిన్ను నిలబెడుతుంది. ప్రతి రోజూ వర్కవుట్స్‌ చేయడం, షూటింగ్‌ చేయడం బోరింగ్‌గా ఉంటుంది. అయినా ఈ రోజు సక్సెస్‌ అయిన వారంతా అదేపని చేశారు. నువ్వు కూడా అదే చేయాలి.

    ఇక యాక్టింగ్‌ కుటుంబం నుంచి వచ్చిన నేను ‘సైరా’ నుంచి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసినా నా మనసంతా నటనవైపే ఉంటుంది. మీ నాన్న, మీ బాబాయ్‌ ప్రొడక్షన్‌లో ఉన్నారు కాబట్టి నువ్వు యాక్టింగ్‌పైనే దృష్టిపెట్టు. అనుపమా మంచి నటి. ఈ సంక్రాంతికి మా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రాకపోయినా బాధగా లేదు.. ఎందుకంటే మూడున్నరేళ్లు కష్టపడ్డ సినిమా కరెక్ట్‌ టైమ్‌లో రావాలి. ఎప్పుడు రావాలన్నది రాజమౌళి, దానయ్యగార్లు నిర్ణయిస్తారు. నన్ను ఆశీర్వదించి నట్లే ఆశిష్‌ని కూడా ఆశీర్వదించండి.. ‘రౌడీ బాయ్స్‌’ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని చరణ్ చెప్పుకొచ్చాడు .

    Also Read: ‘పూజా హెగ్డే’ స్పెషల్ వీడియో.. నిషా అగర్వాల్‌ వర్కౌట్లు !

    Tags