
Pushpa 2 The Rule Teaser: అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది. పుష్ప 2 టీజర్ అంచనాలకు మించి ఉంది. సస్పెన్సు, హీరోయిజం, ఎలివేషన్స్ లో ఎక్కడగా తగ్గలేదు. ఫాన్స్ కోరుకున్న ప్రతి అంశం టీజర్లో చూపించారు. జైలు నుండి పారిపోయిన పుష్ప ఏమయ్యాడు? అనే సస్పెన్స్ తో మొదలుపెట్టి గూస్ బంప్స్ ఇంట్రో ఇచ్చారు. పులి కూడా పుష్ప ని చూసి వెనకడుగు వేస్తుందనే డైలాగ్ ఊరమాస్. చివర్లో ఇది పుష్ప రూల్ అని అల్లు అర్జున్ చెప్పడం… కిక్ ఇచ్చింది.
సాధారణంగా టీజర్ ఒక నిమిషం నుండి ఒకటిన్నర నిమిషాల లోపు ఉంటుంది. ట్రైలర్ రెండు నిమిషాలు ఉంటుంది. భిన్నంగా బన్నీ బర్త్ డే టీజర్ మూడు నిమిషాలకు పైగా ఉంది. అంటే ట్రైలర్ కంటే కూడా ఎక్కువ నిడివితో విడుదల చేశారు. దీని వెనుక సుకుమార్ వ్యూహం కనిపిస్తుంది. ఆయన కథపై ఓ హింట్ ఇచ్చేశాడు. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు.

పుష్ప ఒక స్మగ్లర్. చిన్నప్పటి నుండి అణచివేతకు, అవమానాలకు గురవుతాడు. ఎలాగైనా ఎదిగి దానికి బదులు తీర్చుకోవాలి అనుకుంటాడు. పార్ట్ 1లో పుష్పని కేవలం డబ్బు యావతో నేరాలు చేసే స్మగ్లర్ గానే చూపించారు. పార్ట్ 2లో అతనిలోని సామాజిక కోణం చూపించారు. ఎంత నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అయినా… ఇండియన్ మూవీస్ లో హీరో అంటే మంచితనం పరిచయం చేయాల్సిందే.
పుష్ప 2లో అదే చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్ గా ఎదిగి కోట్లు సంపాదిస్తాడు. సంపాదించిన దాన్ని పేదలకు పంచి పెడతాడు. అదే ఈ చిత్రం ప్రధాన అంశం. పుష్ప జైలుకి ఎందుకు వెళ్ళాడు? అతన్ని ఇరికించింది ఎవరు? చివరికి ఒక క్రిమినల్ జీవితం ఎలా ముగిసింది? అనేదే పుష్ప 2. మొత్తంగా సుకుమార్ అంచనాలు పెంచేశాడు. పుష్ప 2 భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.